- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సౌదీ బస్సు ప్రమాదం.. షాకింగ్ విషయాలు వెల్లడించిన మృత్యుంజయుడు
సౌదీ అరేబియాలో గత నెలల జరిగిన భయంకర రోడ్డు ప్రమాదంలో 45 మంది హైదరాబాద్ లో సజీవ దహనమయ్యారు. ఆ బస్సు ప్రమాదం నుంచి గాయాలతో బయటపడిన మహ్మద్ అబ్దుల్ షోయబ్ అనే యువకుడు ప్రమాదం జరిగిన తీరును వివరించాడు.

దిశ, వెబ్‌డెస్క్: సౌదీ అరేబియాలో గత నెలల జరిగిన భయంకర రోడ్డు ప్రమాదంలో 45 మంది హైదరాబాద్ లో సజీవ దహనమయ్యారు. ఆ బస్సు ప్రమాదం నుంచి గాయాలతో బయటపడిన మహ్మద్ అబ్దుల్ షోయబ్ అనే యువకుడు ప్రమాదం జరిగిన తీరును వివరించాడు. తలకు గట్టి గాయాలతో సౌదీలోని ఆసుపత్రిలో చికిత్స పొందిన అతడు, మంగళవారం హైదరాబాద్‌కు తిరిగి చేరుకున్నాడు. ఎయిర్‌పోర్ట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ఆ భయానక క్షణాలను కన్నీళ్లతో వివరించాడు.
‘మదీనాకు వెళ్లే బస్సులో ప్రయాణిస్తుండగా, ఒకరు మూత్ర విసర్జన కోసం వాహనాన్ని ఆపమని డ్రైవర్‌ను అడిగాడు. ఆ సమయంలో వెనుక నుంచి దేగుడుగా వచ్చిన డీజిల్ ట్యాంకర్ మా బస్సును గట్టిగా ఢీకొట్టింది. క్షణాల్లోనే మంటలు బస్సు మీదికి వ్యాపించాయి. నేను కిటికీ ద్వారా బయటకు దూకాను, కానీ అప్పటికే నా దుస్తులు కాలిపోతున్నాయి. ఎవరినీ రక్షించలేని స్థితిలో ఉన్నాను. డ్రైవర్ సీటు పక్కనే కూర్చోబడి ఉండటం వల్లనే ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నాను. బస్సులో నాతో సహా మొత్తం 46 మంది ఉన్నాం. నా కళ్ల ముందే అందరూ మరణించారు. వాళ్లలో నా తల్లిదండ్రులు, తాత కూడా ఉన్నారు’ అంటూ షోయబ్ బాధాతప్త హృదయంతో చెప్పాడు.
నవంబర్ 9న హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి 54 మంది ఉమ్రా ప్రయాణానికి బయలుదేరారు. మొదట జెడ్డాకు చేరుకుని, 10న మక్కాకు వెళ్లి పవిత్ర కార్యక్రమాలు పూర్తి చేశారు. తర్వాత సమీప ప్రదేశాల్లోని ముఖ్యమైన దైవస్థలాలను సందర్శించారు. 10 నుంచి 16 వరకు మక్కాలోనే ఉన్నారు. 16వ తేదీ రాత్రి మదీనాకు బస్సు ద్వారా ప్రయాణించాలని ప్లాన్ చేసుకున్నారు. వారిలో 46 మంది బస్సులో మదీనాకు బయలుదేరారు. అర్ధరాత్రి దాటిన సమయంలో, సౌదీ సమయం ప్రకారం రాత్రి 11 గంటల సమయంలో మదీనా నుంచి 25 కిలోమీటర్ల దూరంలో డీజిల్ ట్యాంకర్‌ను ఢీ కొట్టిన బస్సు క్షణాల్లో మంటలకు ఆహుతయింది. ఆ మంటల్లోనే 45 మంది సజీవదహనమయ్యారు.






