వృద్ధులు, యువతపై సర్వే.. వెలుగులోకి సంచలన విషయాలు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-06-14 02:24:34  IST  )

వృద్ధులపై యువత అభిప్రాయం, పరస్పర అవగాహన, వృద్ధులకు యువత ఇచ్చే గౌరవం తదితర అంశాలపై ‘హెల్ప్ ఏజ్ ఇండియా’ అనే సంస్థ సర్వే నిర్వహించింది. ఇందులో అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇందుకు

వృద్ధులు, యువతపై సర్వే.. వెలుగులోకి సంచలన విషయాలు
X

దిశ, హైదరాబాద్ బ్యూరో :వృద్ధులపై యువత అభిప్రాయం, పరస్పర అవగాహన, వృద్ధులకు యువత ఇచ్చే గౌరవం తదితర అంశాలపై ‘హెల్ప్ ఏజ్ ఇండియా’ అనే సంస్థ సర్వే నిర్వహించింది. ఇందులో అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇందుకుసంబంధించి రిపోర్ట్‌ను తాజాగా విడుదల చేసింది. 10 మెట్రో, నాన్ మెట్రో నగరాల్లో 5798 మందిపై ఈ సర్వే నిర్వహించగా.. ఇందులో 7 శాతం యువత, 30 శాతం వృద్ధులు పాల్గొన్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. వృద్ధాప్యంపై యువత భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నారు. 56 శాతం మంది ఇతరులపై ఆధారపడి ఉన్నారని, 48 శాతం మంది ఒంటరిగా ఉన్నారని భావిస్తున్నారని, 51 శాతం మంది వృద్ధులు జ్ఞానవంతులని, 43 శాతం మంది గౌరవంగా ఉన్నట్లు యువత అభిప్రాయం వ్యక్తం చేశారు.

వృద్ధుల్లో 54 శాతం మంది వృద్ధాప్యం గురించి నెగెటివ్ ఫీలింగ్‌లు కలిగి ఉన్నారని, నిర్లక్ష్యానికి గురవుతున్నట్లు పేర్కొనగా.. 47 శాతం మంది ఒంటరితనంతో ఫీలవుతున్నట్లు తెలిపారు. 63 శాతం యువత వృద్ధులకు గౌరవం ఇస్తున్నారని, ఆశ్చర్యకరంగా వృద్ధులకు దగ్గరగా ఉన్న యువతకు నెగెటివ్‌ బైయాస్ ఎక్కువగా కనిపించిందని రిపోర్ట్‌లో వెల్లడయింది. యువతలో 49 శాతం మంది తాత–తాతమ్మలతో, 45 శాతం తల్లిదండ్రులతో సంబంధం కలిగి ఉన్నారని తేలింది. వృద్ధులు మనమల్ల కంటే కొడుకులతో ఎక్కువగా గడుపుతారని సర్వేలో స్పష్టమైంది. ఇలా అనేక అంశాలపై యువత, వృద్ధులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయగా.. అంతిమంగా కుటుంబ విలువలు, వృద్ధులకు గౌరవం, మర్యాద, సహకారం విషయంలో మాత్రం నేటికీ యువత ముందు వరుసలో ఉండడం గమనార్హం.

Next Story