ఆస్తి పన్ను వసూళ్లలో జోరు.. కార్పొరేషన్లలో గ్రేటర్ వరంగల్ టాప్!

by Kema Shiva Kumar |

తెలంగాణలో ఆస్తి పన్ను వసూళ్లలో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ మరియు జమ్మికుంట మున్సిపాలిటీ అగ్రస్థానంలో నిలిచాయి.

ఆస్తి పన్ను వసూళ్లలో జోరు.. కార్పొరేషన్లలో గ్రేటర్ వరంగల్ టాప్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: మున్సిపాలిటీలకు ప్రధాన ఆదాయ వనరైన ప్రాపర్టీ ట్యాక్స్‌పై మున్సిపల్ శాఖ ఫోకస్ పెట్టింది. గతేడాదిలో రూ.685కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈనెల 30 వరకు ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించినవారికి 5శాతం రాయితీ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎర్లీబర్డ్ స్కీమ్ ద్వారా పురపాలకశాఖలోని కమిషనర్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) పరిధిలోని 131పట్టణ స్థానిక సంస్థలు ఇప్పటివరకు రూ.81.10కోట్లు వసూలు చేశాయి. గతేడాది ఎర్లీబర్డ్ స్కీమ్‌లో రూ.400 కోట్లు వసూలు చేశారు. ఆదాయం ఎక్కువగా వచ్చే 27 శివారు మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో ప్రాపర్టీ వసూలు సైతం తగ్గిపోయాయి.

20,56,688 అసెస్‌మెంట్స్..

రాష్ట్రంలోని 131పట్టణ స్థానిక సంస్థల్లో 9 మున్సిపల్ కార్పొరేషన్లు, 122 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిల్లో 20,56,688 ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్ మెంట్స్ ఉన్నాయి. వీటి ద్వారా రూ.1,670.48కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ రావాల్సి ఉంది. ఎర్లీబర్డ్ స్కీమ్‌లో భాగంగా ఇప్పటివరకు 1,68,357 అసెస్ మెంట్స్ ద్వారా రూ.81.10కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ అంటే 4.86శాతం మాత్రమై వసూలైంది. అయితే గతేడాది ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లలో ముందంజలో నిలిచిన జమ్మికుంట ఎర్లీబర్డ్‌లో సైతం ముందంజలోనే ఉంది.

గ్రేటర్ వరంగల్ టాప్..

మున్సిపల్ కార్పొరేషన్లలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ టాప్‌లో ఉన్నది. ఇక్కడ అత్యధికంగా రూ.10.49కోట్లు వసూలైంది. అయితే డిమాండ్ ఆధారంగా చూస్తే తక్కువగానే ఉంది. అతితక్కువగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో రూ.62లక్షలు మాత్రమే వసూలైంది.

Next Story