- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BRS పార్లమెంటరీ పార్టీ నేతగా సురేష్ రెడ్డి.. కేకే స్థానాన్ని భర్తీ చేసిన KCR
by Satheesh |
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా, రాజ్యసభలో పార్టీ ఫ్లోర్ లీడర్‌గా రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి నియామకం అయ్యారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా, రాజ్యసభలో పార్టీ ఫ్లోర్ లీడర్‌గా రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి నియామకం అయ్యారు. సోమవారం పార్టీ అధినేత కేసీఆర్ సురేష్ రెడ్డిని నియమిస్తున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న కేకే ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. సురేష్ రెడ్డి సీనియర్ నేత కావడం, తెలంగాణలోని అన్ని అంశాలపై పట్టుండటంతో ప్లోర్ లీడర్‌గా గులాబీ బాస్ ఆయనను నియమించారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు, లోక్ సభ సెక్రటరీ జనరల్‌కు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ విడి విడిగా లేఖలు రాశారు.
Next Story






