- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CPI Leader: అధికారిక లాంఛనాలతో సురవరం అంతిమయాత్ర.. సీఎం ఆదేశాలు.. అంతిమయాత్ర వివరాలు
కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత, సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర రెడ్డికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత, సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి (Suravaram Sudhakar Reddy)కి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు. కాగా, వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సురవరం సుధాకర్‌రెడ్డి గచ్చిబౌలి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే.
అంతిమయాత్ర వివరాలు..
1. ఆదివారం ఉదయం 9 గంటలకు కేర్ హాస్పటల్, గచ్చిబౌలి నుండి భౌతికకాయం మఖ్దూం భవన్‌కు తరలింపు
2. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్‌లో ప్రముఖులు, వివిధ పార్టీల నాయకులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ప్రజల సందర్శనార్థం భౌతికకాయం ఉంచబడుతుంది.
3. మధ్యాహ్నం 3 గంటలకు మఖ్దూం భవన్ నుంచి గాంధీ మెడికల్ కాలేజీకి వరకు అంతిమ యాత్ర
4. సాయంత్రం 5 గంటలకు పార్థీవ దేహాన్ని వైద్య విద్యార్థుల పరిశోధనల నిమిత్తం మెడికల్ కాలేజీకి అప్పగింత
అన్ని జిల్లాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎర్ర చొక్కాలు, స్త్రీలు ఎర్ర చీరలు ధరించి అంతిమ యాత్రలో అధిక సంఖ్యలో పాల్గొనాలని ఈ మేరకు శనివారం సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) ఒక ప్రకటన విడుదల చేశారు. రేపు జరగబోయే ఈ కార్యక్రమాన్ని అధికార లాంఛనాలతో జరపాలని సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లు వెల్లడించారు. వెంటనే సీఎం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల అనంతరం ఊరేగింపు కంటే ముందు అధికార లాంఛనాలతో భౌతికకాయానికి గౌరవ సూచకంగా నివాళులు అర్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, వివిధ పార్టీల నాయకులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు.






