కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు సుప్రీంకోర్టు షాక్..TG హైకోర్టు ఆర్డర్‌పై ట్విస్ట్

by Prasad Jukanti |

కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో చుక్కెదురు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక బెయిల్‌పై స్టే విధించిన సర్వోన్నత న్యాయస్థానం.

కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు సుప్రీంకోర్టు షాక్..TG హైకోర్టు ఆర్డర్‌పై ట్విస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు (Pawan Khera) సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ హైకోర్టు (Telangana High Court) జారీ చేసిన తాత్కాలిక ముందస్తు బెయిల్‌పై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. అసోం సీఎం హిమంత బిశ్వశర్మ భార్య రిణికి భూయాన్‌ శర్మకు వివిధ దేశాల పాస్ పోర్టులు ఉన్నాయంటూ పవన్ ఖేరా చేసిన ఆరోపణలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో రిణికి భూయాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పవన్‌ ఖేరాపై గువాహటిలో కేసు నమోదు అయింది. ఆ తర్వాత పవన్ ఖేరా కోసం అసోం పోలీసులు వెతుకుతున్నారు. ఈ క్రమంలో ఆయన హైదరాబాద్‍లో తలదాచుకున్నారు. ఈ క్రమంలోపవన్ ఖేరా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై ఈనెల10న విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె. సుజన.. పవన్‌ ఖేరాకు వారంరోజుల పాటు షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ మంజూరు చేశారు. ఈ లోపు తగిన ఉపశమనం కోసం గువాహటి హైకోర్టును ఆశ్రయించాలని ఆదేశించారు. తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేయడాన్ని అసోం పోలీసులు ఈ నెల 12వ తేదీన సుప్రీంకోర్టులో సవాల్ చేసారు. ఈ పిటిషన్‍పై ఇవాళ విచారణ జరిపిన సుప్రీంకోర్టు(Supreme Court).. తెలంగాణ హైకోర్టు జారీ చేసిన తాత్కాలిక ముందస్తు బెయిల్‌పై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది.

Next Story