చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారు.. ప్రభుత్వంపై సుప్రీం సీరియస్

by Bhoopathi Nagaiah |

హెచ్‌సీయూ సమీపంలోని కంచ గచ్చిబౌలి భూముల్లో జరుగుతున్న అన్ని పనులను తక్షణమే ఆపేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారు.. ప్రభుత్వంపై సుప్రీం సీరియస్
X

హెచ్‌సీయూ సమీపంలోని కంచ గచ్చిబౌలి భూముల్లో జరుగుతున్న అన్ని పనులను తక్షణమే ఆపేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది చాలా సీరియస్ విషయమంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదిగా చేర్చిన సుప్రీం.. అక్కడ అత్యవసరంగా కార్యకలాపాలు చేపట్టాల్సిన అవసరం ఏంటని నిలదీసింది. అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఈనెల 16న తదుపరి విచారణ చేపడతామని స్పష్టం చేసింది. అసలు ఈ కేసు ఏంటి? పిటిషనర్ ఎవరు? సుప్రీం ఎందుకు సీనియస్ అయిందో తెలుసుకోవాలంటే ఈ లింక్ ఓపెన్ చేసి చదవండి.

బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌కు బిగ్ రిలీఫ్ దక్కింది. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆయనపై నమోదైన రైల్‌రోకో కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. 2011 అక్టోబర్ 15న ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా సికింద్రాబాద్‌లో రైల్‌రోకో చేపట్టారు. ఆ సమయంలో కేసు నమోదు చేసి పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు ఇప్పటివరకు ప్రజాప్రతినిధుల కోర్టులో పెండింగ్‌లో ఉంది. కేసీఆర్ పిలుపు మేరకే రైల్‌రోకో చేపట్టారని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కోర్టుకు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

తెలంగాణలోని మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల కలెక్టర్ కార్యాలయాకు బాంబు బెదిరింపులు వచ్చాయి. బాంబు పెట్టి కలెక్టర్ కార్యాలయాన్ని పేల్చివేస్తామని, కలెక్టర్‌ను చంపేస్తామంటూ ఓ ఆగంతకుడు ఈ-మెయిల్ చేశాడు. నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఇదే విధమైన బెదిరింపులు రావడంతో పోలీసులు బాంబు స్క్వాడ్‌తో సోదాలు చేశారు. అయితే ఈ బెదిరింపులకు ఎవరు పాల్పడ్డారు? మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ), సన్ రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్‌హెచ్) యాజమాన్యానికి మధ్య ఐపీఎల్ కాంప్లిమెంటరీ పాస్‌ల విషయంలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. హెచ్‌సీఏ తమపై ఒత్తిడి ఆపకపోతే హైదరాబాద్‌ను వదిలి వెళ్లిపోతామని ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం బహిరంగంగా ప్రకటించింది. ఈ నేపధ్యంలో ఆంధ్ర క్రికెట్ ఆసోసియేషన్(ఏసీఏ).. సన్ రైజర్స్ జట్టును ఏపీకి రావాలని ఆహ్వానం పలికింది. సన్ రైజర్స్ మిగిలిన మ్యాచులను వైజాగ్ స్టేడియంలో నిర్వహించాలని కోరింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ లింక్‌లో తెలుసుకోండి.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకలేస్తే తినేది బీఫ్.. అని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన భార్యతో పాటు పిల్లలు కూడా క్రైస్తవులేనని పవన్ చాలాసార్లు చెప్పారని గుర్తుచేశారు. తనకు ఆకలేస్తే బీఫ్ తింటానని స్వయంగా పవన్ తనతో చెప్పారంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఇంట్లో వాళ్ల అమ్మ దీపం వెలిగిస్తే.. వాళ్ల నాన్న దానికి సిగరెట్ వెలిగించుకునే వారని కూడా చెప్పారని గుర్తుచేశారు. ఇంకా చాలా సంచలన విషయాలు వెల్లడించారు. అవేంటో ఈ లింక్ క్లిక్ చేసి మీరే చూడండి.

Next Story