- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కంచ గచ్చిబౌలి భూములపై మరోసారి సుప్రీంకోర్టు హెచ్చరిక..!
హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వ అధికారలకు మరోసారి హెచ్చరిక చేసింది.

- పర్యావరణ పునరుద్ధరణ పై కౌంటర్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం..
- సీఎస్ తో సహ సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి ఉంటుదన్న సుప్రీం దర్మాసనం ..
- పరిశీలనకు గడువు కోరిన అమికస్ క్యూరీ
- ఆగస్టు 13కు విచారణ వాయిదా
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వ అధికారలకు మరోసారి హెచ్చరిక చేసింది. పర్యావరణ పునరుద్ధరణ జరపకపోతే సీఎస్ తో సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు సీజేఐ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం నేతృత్వంలో కంచ గచ్చిబౌలి భూముల వ్యవహరంలో బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కంచ గచ్చిబౌలి భూముల్లో అనుమతులు లేకుండా చెట్లు కొట్టేసిన వ్యవహారంపై సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. పర్యావరణ పునరుద్ధరణపై మంగళవారమే రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ ఫైల్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై రిప్లయ్ దాఖలుకు అమికస్ క్యూరీ రెండు వారాల సమయం కావాలని సమయం కోరారు. కంచ గచ్చిబౌలి భూముల్లో ప్రస్తుత పరిస్థితులపై జస్టిన్ బీఆర్ గవాయ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్లను ప్రశ్నించారు. కంచ గచ్చిబౌలి భూముల్లో అన్ని పనులు ఆపేశాం అని ప్రభుత్వం తరపు అడ్వకేట్ వివరణ ఇచ్చారు. అభివృద్ధి కోసం అడవులను నరకడం సమంజనం కాదని, రాత్రికి రాత్రి బుల్డోజర్ పెట్టి అడవిని తీసేద్దామనుకున్నారని జస్టీస్ మందలించారు. అడవిని కాపాడకుంటే అధికారులను అక్కడే టెంపరరీగా జైలుకు పంపుతాం అని హెచ్చరించారు. విచారణను ఆగస్టు 13వ తేదికి వాయిదా వేశారు.






