బీహార్‌లో ఓటర్ల తొలగింపుపై సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయం

by velandi.Saikiran |

బీహార్‌లో ఓటర్ల తొలగింపుపై సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయం : టీపీసీసీ చీఫ్​మహేష్ కుమార్ గౌడ్

బీహార్‌లో ఓటర్ల తొలగింపుపై సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయం
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీహార్‌లో ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల జాబితా ఎస్ ఐఆర్​పై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ప్రజాస్వామ్యానికి గొప్ప విజయం టీపీసీసీ చీఫ్​మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తొలగించబడిన 65 లక్షల ఓటర్ల పేర్లను 48 గంటల్లో వెబ్‌సైట్‌లో ప్రకటించాలని సుప్రీంకోర్టు ఆదేశించందన్నారు. గురువారం మహేష్​కుమార్​గౌడ్​ ప్రకటన విడుదల చేశారు. రాహుల్ గాంధీ లేవనెత్తిన ఓటు చోరీ ఆరోపణలు సుప్రీంకోర్టు తీర్పుతో రుజువైందని తెలిపారు. పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ చర్చకు పట్టుబట్టినా కేంద్రం స్పందించకపోవడం విచారమని, ఆధార్ లింక్‌తో ఒక ఓటు – ఒక మనిషి విధానం అమలు చేయాలన్న రాహుల్ గాంధీ డిమాండ్‌పై ఎన్నికల సంఘం స్పందించాలని మహేష్​కుమార్​గౌడ్ డిమాండ్​చేశారు.

Next Story