'ఓటర్ ప్రొఫైలింగ్' పిటిషన్‌పై విచారణకు స్వీకరించిన సుప్రీం

by GSrikanth |   (  Updated:2022-12-14 15:19:49  IST  )

ఓటరు కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు 'తెలియని సాఫ్ట్‌వేర్‌'ను అమర్చి కేంద్ర(భారత) ఎన్నికల సంఘం

ఓటర్ ప్రొఫైలింగ్ పిటిషన్‌పై విచారణకు స్వీకరించిన సుప్రీం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఓటరు కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు 'తెలియని సాఫ్ట్‌వేర్‌'ను అమర్చి కేంద్ర(భారత) ఎన్నికల సంఘం 'ఓటర్ ప్రొఫైలింగ్'కు పాల్పడిందని ఆరోపిస్తూ హైదరాబాద్‌కు చెందిన ఇంజినీర్ శ్రీనివాస్ కొడాలి దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. తెలియని సాఫ్ట్‌వేర్ అమర్చడం వల్ల పౌరుల హక్కులు హరిస్తుందంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. 'ఇది ముఖ్యమైన అంశం' అని సీజేఐ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. కొడాలి గతంలో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా... ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది.

కానీ, చాలా ముఖ్యమైనటు వంటి అంశాలను కొడాలి శ్రీనివాస్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఓటరు రికార్డులను యాక్సెస్ చేయడానికి, కాపీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలను ఈసీఐ అనుమతి ఇచ్చింది. ఓటర్ జాబితాను ఆధార్ తో అనుసంధానం చేసే ప్రక్రియలో భాగంగా మతం, కులం, తెగ, జాతి, భాష, అర్హత, ఆదాయం, వైద్య చరిత్రతో సహా ఓటర్ల సున్నితమైన సమాచారంతో అనుసంధానిచబడుతుంది. దీని వల్ల రాజకీయ నాయకులు ఓటరు జాబితా నుంచి పలువురిని తీసేయడానికి ఓటర్ ప్రొఫైలింగ్ అనేది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా, ఈ ఓటర్ల జాబితాను ధృవీకరించడానికి, లేదా కొత్త అల్గారితంను ఉపయోగించుకునేందుకు ప్రత్యేకమైన చట్టం కూడా లేదు. చట్టం ద్వారా కాకుండా, ఎటువంటి చట్టం లేకుండా ఇటువంటి కార్యక్రమాలు చేయడం సరికాదని పిటిషనర్ పేర్కొన్నారు.

Next Story