ఆ గలీజ్, అసభ్యకరమైన వీడియోలు ఏంది..? బాధ్యత ఉండక్కర్లేదా?

by Bhoopathi Nagaiah |

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న లైంగిక, అసభ్యకరమైన కంటెంట్‌ను నిషేధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌‌పై ఇవాళ విచారణ చేపట్టింది.

ఆ గలీజ్, అసభ్యకరమైన వీడియోలు ఏంది..? బాధ్యత ఉండక్కర్లేదా?
X

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న లైంగిక, అసభ్యకరమైన కంటెంట్‌ను నిషేధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌‌పై ఇవాళ జస్టిస్ బీఆర్ గవాయ్, అగస్టిన్ జార్జ్ మాసిహ్‌‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా ఆన్‌లైన్‌‌‌లో అశ్లీల, లైంగిక, అసభ్యకర డేటాను నియంత్రించేందుకు జాతీయ కంటెంట్ నియంత్రణ అథారిటీని ఏర్పాటు చేసేలా వెంటనే కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషనర్లు ధర్మాసనాన్ని విజ్ఞప్తి చేశారు. దీనిపై కోర్టు ఎలా స్పందించిందో మీరే ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

అప్పట్లో ఐటీని ప్రమోట్ చేసి అభివృద్ధి సాధించామని, ఇప్పుడు క్వాంటం టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాజధాని అమరావతిలోని విట్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న 'వి లాంచ్‌పాడ్ 2025 - స్టార్టప్ ఎక్స్‌పో'కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ప్రాంగణంలో గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అమరావతి అన్ స్టాపబుల్ అని, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన యూనివర్సిటీలను తీసుకొస్తామని చెప్పారు. ప్రపంచంలో ఉండే టెక్నాలజీని, నాలెడ్జిని ఏపీలో అందుబాటులోకి తెస్తామని, దానిని అందిపుచ్చుకునే బాధ్యత యువతదేనని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు ఇంకా ఏమన్నారో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ప్రస్తుతం పెరిగిపోయిన ధరల నేపథ్యంలో ఒక గ్రాము కొనుగోలు చేయాలన్నా దాదాపు పదివేల రూపాయలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి అక్షయ తృతీయ రోజు తప్పనిసరిగా బంగారం కొనుగోలు చేయాలని చాలామంది సెంటిమెంట్‌గా భావిస్తారు. ఈ క్రమంలో ప్రస్తుతం చాలావరకు ఫోన్ పే, పేటీయం, గూగుల్ పే వంటి యాప్స్ డిజిటల్ గోల్డ్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొని డిజిటల్ గోల్డ్ సేవింగ్స్ స్కీం సేవలను అందిస్తున్నాయి. ఆ వివరాలు ఏంటో ఈ లింక్‌ ఓపెన్ చేసి మీరు తెలుసుకోండి.

పదేళ్లు అధికారంలో ఉన్న ఓ కుటుంబం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని, కుటుంబ పాలన, అవినీతితో దివాలా తీయించారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన నల్లగొండ కలెక్టర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. సాగునీటి రంగంలో రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసి బీఆర్ఎస్ నేతలు జేబులు నింపుకున్నారని ఆరోపించారు. వారి కమీషన్ కక్కుర్తి వల్లే కాళేశ్వరం నాణ్యత లోపించిందన్నారు. రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించిన ప్రాజెక్టు.. మూడేళ్లలోనే కూలిపోవడం దారుణమన్నారు. మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలు పనికిరావని ఎన్‌ఎస్‌డీఏ చెప్పిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ఉత్తమ్ ఇంకా ఏమన్నారో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

Next Story