ఆ 15 వేల కోట్ల విలువైన భూమి ప్రభుత్వానిదే : సుప్రీంకోర్ట్

by Muthe.Rajitha |

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది.

ఆ 15 వేల కోట్ల విలువైన భూమి ప్రభుత్వానిదే : సుప్రీంకోర్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. సుమారు రూ.15 వేల కోట్ల విలువ చేసే భూమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. హైదరాబాద్‌ లోని వనస్థలిపురం సమీపంలోని సాహెబ్‌నగర్‌ వద్ద ఉన్న 102 ఎకరాల భూమి పూర్తిగా తెలంగాణ అటవీశాఖదేనని తెలిపింది. దాదాపు 20 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ భూ వివాదంలో నిజాం, సాలార్‌ జంగ్‌, మీరాలం వారసులమంటూ పలువురు యాజమాన్య హక్కులు కోరగా, గతంలో 260 మంది పిటిషనర్లకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది.

ఆ తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. సుదీర్ఘ విచారణ అనంతరం జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టిల ధర్మాసనం ఈ భూమి అటవీ భూమేనని స్పష్టం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికే పూర్తి హక్కులు కల్పించింది. అలాగే ఈ భూమిని 8 వారాల్లో రిజర్వ్‌ ఫారెస్ట్‌గా నోటిఫై చేసి, ఆ నోటిఫికేషన్‌ ప్రతిని సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి పంపాలని తెలంగాణ సీఎస్ కు ఆదేశాలు జారీ చేసింది.

Next Story