Vamanarao murder case: వామనరావు హత్య కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

by Prasad Jukanti |

వామనరావు హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Vamanarao murder case: వామనరావు హత్య కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాది గట్టు వామనరావు దంపతుల హత్య కేసులో (Vamanarao murder case) సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి (Telangana government) నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన రికార్డులను 3 వారాల్లో అందజేయాలని ఆదేశించింది. న్యాయవాద దంపతుల హత్య అంశంపై సీబీఐ (CBI) విచారణ జరపాలని వామనరావు కుమారుడు గట్టు కిషన్ రావు సుప్రీంకోర్టులో (Supreme Court) పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇవాళ జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ రాజేశ్ బిందాల్ ధర్మాసం విచారణ జరిపింది. ఈ కేసుకు సంబంధించి రికార్డు అయిన వీడియోలులతో సహా అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్ పత్రాలు తమ ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. ఆ రికార్డులను పరిశీలించిన తర్వాత సీబీఐ విచారణ జరపాలా లేదా అన్న విషయాన్ని నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Next Story