KTR : కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

by Muthe.Rajitha |   (  Updated:2025-06-06 10:59:47  IST  )

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కు బిగ్ షాక్ తగిలింది.

KTR : కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కు బిగ్ షాక్ తగిలింది. శుక్రవారం సుప్రీంకోర్టు(Suprem Court) ఆయనకు నోటీసులు(Notice) జారీ చేసింది. గతంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై, కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ అవినీతి ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రూ.25 వేల కోట్లు కమీషన్ తీసుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా, ఈ వ్యవహారంలో అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పీఎస్‌లో ఆత్రం సుగుణ పరువునష్టం కింద కేటీఆర్‌పై కేసు నమోదు చేశారు. కాగా తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాల్సిందిగా ఆయన హైకోర్టులో పిటిషన్ వేయగా.. తీర్పు కేటీఆర్‌కు అనుకూలంగా ఇచ్చింది న్యాయస్థానం. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సుగుణ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. వివరణ ఇవ్వాలంటూ కేటీఆర్‌కు నేడు దేశంలోని అత్యున్నత ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

Next Story