కేసీఆర్‌కు సిట్ ఇచ్చిన నోటీసులు చెల్లవు! సుప్రీంకోర్టు న్యాయవాది సంచలన వ్యాఖ్యలు

by Ramesh Naini |

తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.

కేసీఆర్‌కు సిట్ ఇచ్చిన నోటీసులు చెల్లవు! సుప్రీంకోర్టు న్యాయవాది సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశంపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టు న్యాయవాది మోహిత్ రావు స్పందించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌కు సిట్ ఇచ్చిన నోటీసులు చెల్లవని సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్ట ప్రకారం.. 60 ఏళ్లు పైబడిన వారు, తాము ఎక్కడ కోరితే అక్కడికే విచారణ చేయాల్సి ఉంటుందని తెలిపారు. నిజానికి.. కేసీఆర్‌కు పోలీసులు నోటీసులు ఇవ్వలేదు, ఇవ్వలేరు.. దానికో చట్టం ఉందని న్యాయవాది మోహిత్ రావు స్పష్టం చేశారు.

నందినగర్ నివాసంలోనే విచారణ..

కాగా, శుక్రవారం మాజీ సీఎం కేసీఆర్‌కు మరోసారి సిట్ నోటీసులు జారీ చేసింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశాలిచ్చింది. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో విచారణ జరపాలన్న కేసీఆర్ అభ్యర్థన తిరస్కరించింది. నంది నగర్ నివాసంలోనే విచారణకు అందుబాటులో ఉండాలని నోటీసుల్లో స్పష్టం చేసింది.

Next Story