- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఇప్పటి వరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదో సరైన వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ..

దిశ, వెబ్‌డెస్క్: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఇప్పటి వరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదో సరైన వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ.. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు పిటిషన్లపై నేడు విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం.. తెలంగాణ స్పీకర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై మీరు చర్యలు తీసుకుంటారా? లేక మేం తీసుకోవాలా? అని ప్రశ్నించింది. కోర్టు ధిక్కరణ కింద నోటీసులు జారీ చేసింది. మూడు నెలల్లో చర్యలు తీసుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది.
సుప్రీంకోర్టు నోటీసులపై స్పందించిన స్పీకర్ కార్యాలయం.. దీనిపై 8 వారాల సమయం కావాలని కోరింది. మరో నాలుగు వారాల గడువు ఇస్తున్నామని, ఈలోగా ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణను పూర్తి చేసి, నివేదిక సమర్పించాలని సుప్రీం ధర్మాసనం స్పీకర్ గడ్డం ప్రసాద్ ను ఆదేశించింది.
తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 10 ఎమ్మెల్యేలపై అనర్హత విషయానికి సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలైన మూడు వేర్వేరు పిటిషన్లను సీజేఐ బీఆర్ గవాయ్ ధర్మాసనం సోమవారం విచారించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని జులై 31న బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. నిర్దేశిత గడువులోగా స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది.






