హైవేలపై జంతువులు తిరగడంపై సుప్రీం కోర్టు సీరియస్‌.. తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు

by Malleboina Mahesh |   (  Updated:2025-11-07 07:48:10  IST  )

దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, హైవేలపై కుక్కలు, ఆవులు, ఇతర జంతువులు తిరగడంపై సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

హైవేలపై జంతువులు తిరగడంపై సుప్రీం కోర్టు సీరియస్‌.. తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, హైవేలపై కుక్కలు, ఆవులు, ఇతర జంతువులు తిరగడంపై సుప్రీం కోర్టు (Supreme Court) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ జంతువుల సంచారం వల్ల తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజల ప్రాణ భద్రతకు ఇది ముప్పుగా మారిందని కోర్టు వ్యాఖ్యానించింది. వెంటనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కలిసి సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

హైవేలు మరియు ఎక్స్‌ప్రెస్‌వేలు సురక్షితంగా ఉండేలా సరిహద్దు కంచెలు (Boundary fences) ఏర్పాటు చేయడంతో పాటు జంతు నియంత్రణ (Animal control) చర్యలు, పర్యవేక్షణ వ్యవస్థలు అమలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా తిరుగుతున్న కుక్కలు, ఆవులు, ఇతర జంతువులను వెంటనే తొలగించాలన్న సుప్రీం కోర్టు ఈ ఆదేశాలపై సంబంధిత అధికారులు వివరాలతో కూడిన స్థితిగతుల నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

Next Story