హైదరాబాద్ జర్నలిస్టులకు Supreme Court శుభవార్త

by GSrikanth |   (  Updated:2022-08-25 09:21:26  IST  )

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ జర్నలిస్టులకు సుప్రీంకోర్టులో శుభవార్త చెప్పింది.

హైదరాబాద్ జర్నలిస్టులకు Supreme Court శుభవార్త
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ జర్నలిస్టులకు సుప్రీంకోర్టులో శుభవార్త చెప్పింది. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు, నిర్మాణానికి సుప్రీం పచ్చజెండా ఊపింది. హైదరాబాద్‌లోని జర్నలిస్టులు సుదీర్ఘకాలంగా ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్నారు. జర్నలిస్టులు, బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులకు కేటాయించిన స్థలాల స్వాధీనానికి సంబంధించి సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుపై తాజాగా విచారణ జరిగింది. సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం జర్నలిస్టులకు స్థలాన్ని అప్పగించేలా తీర్పునిచ్చింది. జర్నలిస్టుల వ్యవహారాన్ని బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులతో ముడిపెట్టకూడదన్న చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ జర్నలిస్టులకు సానుకూలంగా తీర్పునిచ్చారు. 12 ఏళ్ళ కిత్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, అఖిల భారత సర్వీసు అధికారులతో పాటు జర్నలిస్టులకు హైదరాబాద్‌లో ఇళ్ళ స్థలాల కోసం స్థలాన్ని కేటాయించారు.

అయితే, తర్వాత స్థలం విషయంలో కోర్టు కేసులు అయ్యాయి. 12 ఏళ్ళ నుండి న్యాయస్థానాల్లో ఈ అంశం కోనసాగుతూనే ఉంది. అప్పటి నుండి న్యాయస్థానాల సానుకూల స్పందన కోసం జర్నలిస్టులు ఎదురుచూస్తున్నారు. అయితే, తాజాగా రేపు సీజేఐ ఎన్వీ రమణ పదవీ విరమణ కానుండగా ఒకరోజు ముందు జర్నలిస్టులకు గుడ్ న్యూస్ తెలిపారు. సీజేఐ రమణ మాట్లాడుతూ...' జర్నలిస్టుల స్థలాన్ని వారు స్వాధీనం చేసుకోడానికి మేం అనుమతిస్తున్నాం. ఐఏఎస్, ఐపీఎస్‌ల గురించి నేను మాట్లాడ్డం లేదు. ఓ చిన్న జర్నలిస్టు ఎందుకు ఇబ్బందిపడాలి? వారికి భూమి కేటాయించారు. కానీ అభివృద్ధి చేయలేదు. వారంతా కలిసి స్థలం కోసం రూ. 1.33 కోట్లు డిపాజిట్ చేశారు. రూ. 8,000 నుంచి రూ. 50 వేల జీతం తీసుకునే సుమారు 8వేల మంది జర్నలిస్టులు అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటున్నాం. వారి స్థలంలో నిర్మాణాలు కూడా జరుపుకోవచ్చు. ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలకు సంబంధించిన మిగతా కేసును ఇంకో బెంచ్ ముందు లిస్టు చేయండి' అని సీజేఐ తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పుతో జర్నలిస్టులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Next Story