- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Supreme Court: అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ
రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao)ను విచారించేందుకు అనుమతించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ జస్టిస్ బీవీ నాగరత్న (B.V. Nagaratna), జస్టిస్ ఉజ్జల్ భుయాన్ (Ujjal Bhuyan)లతో కూడిన సుప్రీంకోర్టు (Supreme Court) ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
డిసెంబర్, 2004లో సిద్దిపేటకు చెందిన వ్యాపారి చక్రధర్ గౌడ్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు అప్పటి పోలీసు అధికారులు తన ఫోన్‌ను అక్రమంగా ట్యాప్ చేశారని, తనను మానసికం వేధించి భయభ్రాంతులకు గురి చేశారని పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హరీశ్‌రావుపై ఎఫ్ఐఆర్ నమోదైన విషయం తెలిసిందే. అయితే, తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు కేసులో తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ 2025, మార్చి 20న ఆ కేసును కొట్టివేసింది. ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేసు విచారణ కీలక దశలో ఉన్నందున, మాజీ మంత్రి హరీశ్‌రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం సుప్రీం కోర్టును అభ్యర్థించగా.. ఇవాళ ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
కాగా, ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కీలక ఆధారాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. ప్రధాన నిందితుడు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao) విచారణలో కొందరు కీలక నేతల పేర్లను వెల్లడించారని.. అందులో ప్రముఖంగా హరీశ్‌రావు పేరు కూడా ఇటీవలే బయటకు వచ్చింది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కుట్రలో రాజకీయ కోణాన్ని వెలికితీయాలంటే హరీశ్ రావును విచారించడం తప్పనిసరని సిట్ భావిస్తోంది. అందుకే ఆయనను ఈ కేసులో ప్రతివాదిగా చేర్చాలని సిట్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొంది.
Read More..
ఆ ఎమ్మెల్యేపై ఈటల రాజేందర్ సీరియస్..! ఎక్స్ వేదికగా హెచ్చరిక






