- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ ఎమ్మెల్యేపై ఈటల రాజేందర్ సీరియస్..! ఎక్స్ వేదికగా హెచ్చరిక
ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలను ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలను ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఘాటైన స్పందన తెలియజేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్యే హోదాలో ఉండి దేశ ప్రధాని నరేంద్ర మోడీపై కూనంనేని సాంబశివరావు ఉపయోగించిన భాష అత్యంత దురదృష్టకరమని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. కనీస సంస్కారం లేకుండా మాట్లాడటం వారి నైతిక పతనానికి నిదర్శనమని సీరియస్ అయ్యారు. ప్రపంచ దేశాలన్నీ భారత్‌ను గౌరవంగా చూస్తున్న ఈ తరుణంలో, దేశ నాయకులే ఇలాంటి నీచమైన విమర్శలు చేయడం దేశ ప్రతిష్టను దిగజార్చడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ ఉనికి కోసం ప్రధాని మోడీని దూషించడం మానకపోతే, ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఈటల రాజేందర్ హెచ్చరించారు. ట్వీట్ ఇదే..






