- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Supreme Court: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు సుప్రీం కోర్టులో విచారణ..
బీఆర్‌ఎస్ (BRS) గుర్తుపై గెలిచి కాంగ్రెస్ (Congress)లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన మూడు వేర్వేరు పిటిషన్లపై ఇవాళ సుప్రీం కోర్టు (Supreme Court)లో విచారణ జరగనుంది.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్‌ఎస్ (BRS) గుర్తుపై గెలిచి కాంగ్రెస్ (Congress)లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన మూడు వేర్వేరు పిటిషన్లపై ఇవాళ సుప్రీం కోర్టు (Supreme Court)లో విచారణ జరగనుంది. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరెకపూడి గాంధీపై చర్యలు తీసుకునేలా అసెంబ్లీ స్పీకర్‌కు ఆదేశాలివ్వాలని కోరుతూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) రిట్ పిటిషన్ వేశారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరిపై చర్యలకు ఆదేశాలివ్వాలని కోరుతూ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి (Koushik Reddy), కేపీ వివేకానంద్ (Vivekananda) వేర్వేరుగా స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే, ఆ మూడు పిటిషన్లను కలిపి ఇవాళ జస్టిస్ బీఆర్ గవాయి (Justice BR Gawai), జస్టిస్ కే.వినోద్ చంద్రన్ (K.Vinod Chandran) ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది.
కాగా, బీఆర్‌ఎస్ (BRS) ఫిర్యాదుపై లిఖితపూర్వకంగా స్పందించాలని ఈ నెల 4న పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి (Assembly Secretary) నోటీసులు జారీ చేశారు. అయితే, వారు ఎప్పటిలోగా సమాధానం ఇవ్వాలన్న అంశాన్ని మాత్రం నోటీసుల్లో ప్రస్తవించ లేదు. గత విచారణలో భాగంగా హైకోర్టు నాలుగు నెలల్లో ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని గతేడాది మార్చిలో చెప్పినా ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని కౌశిక్‌రెడ్డి (Koushik Reddy), వివేకానంద (Vivekananda) తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని తెలిపారు. అందుకు అసెంబ్లీ కార్యదర్శి (Assembly Secretary) తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ (Mukul Rohatgi) స్పందిస్తూ.. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చామని కోర్టుకు విన్నవిచారు. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునేందుకు ఎమ్మెల్యేలకు స్పీకర్ తగిన సమయం ఇవ్వాలని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన గుర్తు చేశారు. ఎంత సమయం కావాలో స్పీకర్‌ను కనుక్కుని చెప్పాలని ముకుల్ రోహత్గీ (Mukul Rohatgi)కి ధర్మాసనం సూచిస్తూ.. తదుపరి విచారణను కోర్టు ఇవాళ్టికి వాయిదా వేసింది.






