HCU: హెచ్ సీయూలో సుప్రీంకోర్టు సాధికారిక కమిటీ.. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులపై ఆరా

by Prasad Jukanti |   (  Updated:2025-04-10 07:00:22  IST  )

హెచ్ సీయూలో సుప్రీంకోర్టు సాధికారిక కమిటీ పర్యటన ముగిసింది.

HCU: హెచ్ సీయూలో సుప్రీంకోర్టు సాధికారిక కమిటీ.. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులపై ఆరా
X

దిశ, డైనమిక్ బ్యూరో/శేరిలింగంపల్లి : తీవ్ర దుమారం రేపిన హెచ్‌సీయూ సమీపంలోని కంచ గచ్చిబౌలి భూములను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన పర్యావరణ, అటవీ శాఖల కేంద్ర సాధికారిక కమిటీ పరిశీలించింది. నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్న కమిటీ చైర్మన్ సిద్ధాంత దాస్, సభ్యులు సీపీ గోయల్, సునిల్ లిమయి, జేఆర్ భట్ ఇవాళ సర్వే నంబర్ 24లోని భూములను పరిశీలించారు. అయితే కమిటీని కలిసేందుకు విద్యార్థులకు అవకాశం ఇవ్వలేదు. సుమారు గంటపాటు హెచ్‌సీయూలో ఉన్న కమిటీ అనంతరం జూబ్లిహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రానికి బయలుదేరి వెళ్లింది. కాగా హెచ్‌సీయూ విద్యార్థులు ఐదుగురిని అక్కడికి వచ్చి కలిసి తమ అభిప్రాయాలను చెప్పాలని కమిటీ సూచించినట్లు సమాచారం. రేపు పర్యావరణ చట్టాల ఉల్లంఘనపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంస్థలు, ఎన్జీవోల అభిప్రాయాలను సేకరించనున్నట్లు తెలుస్తోంది.

Next Story