- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Supreme Court: జీవన్‌రెడ్డికి సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్.. ముందస్తు బెయిల్ మంజూరు
బీఆర్ఎస్ (BRS) సీనియర్ నేత, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (Jeevan Reddy)కి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ (BRS) సీనియర్ నేత, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (Jeevan Reddy)కి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. మెకిలాలో114 ఎకరాల భూమి కబ్జా చేశారంటూ ఆయనపై ఆ భూ యజమాని సామ దామోదర్ రెడ్డి (Sama Damodar Reddy), మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయనపై మోకిలా (Mokila)తో పాటు చేవెళ్ల (Chevella) పోలీస్ స్టేషన్లలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దీంతో జీవన్ రెడ్డి కేసులో ముందస్తు బెయిల్‌తో పాటు.. తనను, తన కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయకూడదంటూ సుప్రీం కోర్టు (Supreme Court)లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఇవాళ మరోసారి ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది. అదేవిధంగా కేసులో విచారణకు పూర్తిగా సహకరించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదికి సూచించింది.






