కేఏ పాల్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం

by Malleboina Mahesh |

ప్రజాశాంతి పార్టీ జాతీయ అధ్యక్షుడు కేఏ పాల్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

కేఏ పాల్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజాశాంతి పార్టీ జాతీయ అధ్యక్షుడు కేఏ పాల్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై కేఏ పాల్ (కేఏ పాల్) దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు (Supreme Court) ధర్మాసనం కఠిన వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను పరిశీలిస్తూ, “ఇలాంటి విషయాలను నేరుగా సుప్రీంకోర్టుకు తేవడం కంటే ముందు సంబంధిత హైకోర్టును ఆశ్రయించాలి” అని స్పష్టం చేసింది. పిటిషన్‌పై వాదనలు విన్న ధర్మాసనం.. కేవలం “మీరు పబ్లిసిటీ కోసం ఇలాంటి పిటిషన్లు వేస్తున్నారు” అంటూ కేఏ పాల్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ తరహా పిటిషన్లు న్యాయవ్యవస్థ సమయాన్ని వృథా చేస్తున్నాయని, చట్టపరమైన మార్గాన్ని అనుసరించకుండా నేరుగా దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం తగదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాగే ఈ పిటిషన్ విషయంలో పాల్‌కు తగిన ఫోరం అయిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళ్లి వాదించాల‌ని సూచించింది. ఈ పరిణామం మరోసారి కేఏ పాల్ వివాదాస్పద శైలికి సంబంధించిన చర్చలను తెరపైకి తెచ్చింది. న్యాయస్థానం చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో కూడా పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి.

Next Story