Supreme Court: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా .. ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-02-10 06:51:30  IST  )

పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ సుప్రీం కోర్టులో మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే.

Supreme Court: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా .. ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ సుప్రీం కోర్టు (Supreme Court)లో మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. ఇవాళ ఆ పిటిషన్లపై జస్టిస్‌ బీఆర్‌ గవాయి (Justice BR Gawai), జస్టిస్‌ కే.వినోద్‌ చంద్రన్‌ (K.Vinod Chandran) ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనల సందర్భంగా ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ (BRS) నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది.. కాంగ్రెస్ పార్టీ (Congress Party)లో చేరి ఎంపీగా పోటీ చేశారని (దానం నాగేందర్‌ను ఉద్దేశించి) కేటీఆర్ (KTR) తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. మిగతా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల తీరును కూడా కోర్టుకు వివరించారు.

ఈ క్రమంలోనే అసెంబ్లీ కార్యదర్శి (Assembly Secretary) తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ (Mukul Rohatgi) కలుగజేసుకుని ఎమ్మెల్యేలపై అనర్హతకు రీజనబుల్ టైమ్ కావాలని అభ్యర్థించారు. ఆయన వాదనలు విన్న కోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే 10 నెలల సమయం గడిచిందని.. అది రీజనబుల్ టైం కాదా అని మండిపడింది. అందుకు ముకుల్ రోహత్గీ (Mukul Rohatgi) స్పందిస్తూ.. తమ నిర్ణయాన్ని తెలిపేందుకు మరో నాలుగైదు రోజులు సమయం ఇవ్వాలని కోర్టును కోరారు. దీంతో కేసులో తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 18కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

Next Story