Minister Tummala : పంట ఉత్పత్తులకు మద్దతు ధర అందించాలి: మంత్రి తుమ్మల

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-01-31 12:33:32  IST  )

రైతులకు మేలు రకం పంట ఉత్పత్తుల(Ggood Quality Crop Products)కు మద్దతు ధర(Support Price) అందించేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు(Minister Tummala Nageswara Rao)ఆదేశించారు.

Minister Tummala : పంట ఉత్పత్తులకు మద్దతు ధర అందించాలి: మంత్రి తుమ్మల
X

దిశ, వెబ్ డెస్క్ : రైతులకు మేలు రకం పంట ఉత్పత్తుల(Ggood Quality Crop Products)కు మద్దతు ధర(Support Price) అందించేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు(Minister Tummala Nageswara Rao)ఆదేశించారు. సామాజిక మాధ్యమాల్లో మార్కెటింగ్ అంశాలపై వస్తున్న కథనాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. రాష్ట్రంలో వివిధ మార్కెట్లతో పలు పంటలకు సంబంధించి మద్ధతు ధర సమస్యలను మార్కెటింగ్ శాఖ అధికారులు మంత్రి తుమ్మలకు వివరించారు.

ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ రైతులు మార్కెట్లకు తీసుకువచ్చిన తమ పంటకు గరిష్ఠ ధర పొందేందుకు అన్ని అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా క్రయ, విక్రయాలు జరిగేటట్లు చూడాలన్నారు. ప్రతి అధికారి బాధ్యత తీసుకోవాలని మార్కెటింగ్ డైరెక్టర్, ప్రాంతీయ, జిల్లా అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చారు. మార్కెటింగ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ మార్కెట్లకు పంపించాలని తుమ్మల ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలకు తగినట్లు ఉన్న పంట ఉత్పత్తులకు మద్దతు ధర అందించాల్సిందేనని తుమ్మల స్పష్టం చేశారు.

అంతకుముందు మంత్రి తుమ్మల మద్ధతు ధరపై అధికారులతో సమీక్ష చేశారు. అన్ని పంటలను మద్ధతు మేరకు కొనుగోలు చేయాలని, రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 21కందుల కొనుగోలు కేంద్రాలను, 14 పెసర కేంద్రాలు, 42సోయాబిన్ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పంట నిల్వలకు మార్క్ ఫెడ్ గోదాంలను వాడుకోవాలని సూచించారు. అర్హూలైన రైతులందరికి రైతు భరోసా అందుతుందని స్పష్టం చేశారు. అయిల్ ఫామ్ సాగులో రాష్ట్రం నంబర్ వన్ కావాలని ఆకాంక్షించారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకాలతో రైతులు సాగు ఆధునీకరణ మెళకువలను పాటించాలన్నారు.

Next Story