కాంగ్రెస్ పోరాటానికి మద్దతు ఇవ్వండి : జనహిత పాదయాత్రలో మీనాక్షి నటరాజన్

by Muthe.Rajitha |

తెలంగాణ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న జనహిత పాదయాత్ర 3వ రోజు నిజామాబాద్‌ జిల్లాలో జరిగింది.

కాంగ్రెస్ పోరాటానికి మద్దతు ఇవ్వండి : జనహిత పాదయాత్రలో మీనాక్షి నటరాజన్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న జనహిత పాదయాత్ర 3వ రోజు నిజామాబాద్‌ జిల్లాలో జరిగింది. ఈ యాత్రలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీ నాయకులు పాల్గొన్నారు. ఈ పాదయాత్ర ఆర్మూర్ పట్టణంలో ఆలూరు బైపాస్ నుంచి పెరికిట్ చౌరస్తా వరకు జరిగింది. ఈ పాదయాత్రలో మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ... తెలంగాణను దేశానికి రోల్ మోడల్‌గా నిలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అణగారిన వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నిరుపేదల ఓటు హక్కును తొలగిస్తోందని, దేశ సంపదను అంబానీ, అదానీ వంటి ఉన్నత వర్గాలకు దోచిపెడుతోందని విమర్శించారు.

రాహుల్ గాంధీ ఈ అంశంపై చట్టసభల్లో పోరాడుతున్నారని తెలిపారు. మహేష్ కుమార్ గౌడ్‌: మాట్లాడుతూ... ప్రజల కష్టాలు, సంక్షేమ పథకాల అమలు తీరును తెలుసుకునేందుకు ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నామని చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు తప్పిదాలు చేశారని, వారి సంతకాలతోనే ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌కు తాకట్టు పెట్టారని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని వెల్లడించారు.

Next Story