యూరియా సరఫరా చేయండి : నడ్డాకు తుమ్మల విజ్ఙప్తి

by Muthe.Rajitha |

రాష్ట్రానికి ఏప్రిల్, మే నెలలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఎరువులను పూర్తిగా సరఫరా చేయాలని కేంద్ర మంత్రి నడ్డా ను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.

యూరియా సరఫరా చేయండి :  నడ్డాకు తుమ్మల విజ్ఙప్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రానికి ఏప్రిల్, మే నెలలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఎరువులను పూర్తిగా సరఫరా చేయాలని కేంద్ర మంత్రి నడ్డా ను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. మంగళవారం ఆయన నడ్డాకు లేఖ రాశారు. ఈసందర్బంగా పేర్కొంటూ ఈ వానాకాలం సీజన్​కు 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించింది. దానిలో భాగంగా ఏప్రిల్ నెలకు 1.70 లక్షల మెట్రిక్ టన్నులు, మే నెలకు 1.60 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయింపులు చేయగా, ఏప్రిల్ లో కేవలం 1.20 లక్షల మెట్రిక్ టన్నులు, మే నెలలో ఇప్పటి వరకు 0.52 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా జరిగిందన్నారు. వ్యవసాయ శాఖ అదనపు సంచాలకుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర అవసరాల దృష్ట్యా కేటాయింపులు జరిపిన విధంగా వెంటనే యూరియాను పంపించాల్సిందిగా లేఖ ద్వారా విజ్ఙప్తి చేసినట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా ఖరీఫ్ సీజన్ ఆరంభం నాటికి 4 లక్షల నుండి 5 లక్షల టన్నుల మేరకు యూరియాను ముందస్తుగా నిల్వచేయాలని కోరారు. సీజన్ లో డిమాండ్ కు తగ్గట్లుగా సరఫరా చేయడం జరుగుతుందని, ఈ నిల్వలు, అప్పడు సరఫరా కాబడే యూరియాతో కలిపి రైతులకు అందచేయడం ద్వారా ఎక్కడా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా చూస్తున్నామని తెలిపారు.

Next Story