Sunil Rao: అందరి జాతకాలు బయటపెడతా.. బీఆర్ఎస్‌పై సునీల్ రావు సంచలన వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-01-25 04:35:37  IST  )

బీఆర్ఎస్‌ (BRS)కు కంచుకోట అయిన కరీంనగర్ (Karimnagar) జిల్లాలో గులాబీ పార్టీకి ఊహించని షాక్ తగిలింది.

Sunil Rao: అందరి జాతకాలు బయటపెడతా.. బీఆర్ఎస్‌పై సునీల్ రావు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్‌ (BRS)కు కంచుకోట అయిన కరీంనగర్ (Karimnagar) జిల్లాలో గులాబీ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఈ మేరకు బీఆర్ఎస్ (BRS) సీనియర్ లీడర్, కరీంనగర్ (Karimnagar) మేయర్ సునీల్ రావు (Sunil Rao) ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇవాళ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సమక్షంలో 10 మంది కార్పొరేటర్లతో బీజేపీ (BJP)లో చేరబోతున్నారు.

ఈ క్రమంలోనే ఇవాళ ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ (BRS) పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో పెల్లుబికిన అవినీతిని భరించలేకే తాను పార్టీని వీడతున్నానని కామెంట్ చేశారు. రివర్ ఫ్రంట్ (River Front), స్మార్ట్ సిటీ (Smart City) ఇతర పనుల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. ముఖ్యంగా ఓ అవినీతి నేత పేరును తాను త్వరలోనే బయటపెడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌లో ఉన్న ప్రతి నేత అవినీతి చిట్టా తన దగ్గర ఉందని హెచ్చరించారు. సందర్భం వచ్చినప్పుడు గుట్టు విప్పుతానంటూ సునీల్ రావు అన్నారు.

Next Story