- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీఎస్టీ ఇష్యూపై స్పందించిన సునీల్ కుమార్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జీఎస్టీ ఎగవేస్తున్న వ్యాపారవేత్తలపై జీఎస్టీ అధికారులు కొరడా ఝులిపిస్తున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జీఎస్టీ ఎగవేస్తున్న (GST evasion) వ్యాపారవేత్తలపై జీఎస్టీ అధికారులు (GST officials) కొరడా ఝులిపిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జీఎస్టీ పన్ను ఎగవేత కేసులో ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ (Orange Travels MD), తెలంగాణ కాంగ్రెస్ నేత సునీల్ కుమార్(Sunil Kumar)ను అరెస్ట్ చేశారు. దాదాపు రూ.28 కోట్ల పన్ను ఎగవేసినట్లు గుర్తించిన జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు.. బుధవారం ఉదయం అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టు (Nampally Court)లో హాజరుపరిచారు. కాగా ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం గా మారిన విషయం తెలిసిందే.
అయితే ఈ తాజా పరిణామాలపై సునీల్ కుమార్ (Sunil Kumar) స్పందించారు. ప్రతి ఏడాది యధావిధిగా నడుస్తున్న బస్సులపై 5% GST ఆరెంజ్ ట్రావెల్స్ సంస్థ కడుతుందని, అధికారులు దాన్ని 12 శాతానికి పెంచి మరో రూ.24 కోట్లు అదనంగా కట్టాలని ఒత్తిడి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అలాగే తాను ఎన్నో కష్టాల్ని అధిగమించి ప్రజా జీవితంలో కొనసాగుతున్నానని, రెండు మూడు రోజుల్లో సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ సునీల్ కుమార్ చెప్పుకొచ్చారు.






