Breaking News : విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్

by Muthe.Rajitha |

తెలంగాణ(Telangana)లో విద్యార్థులకు భారీ శుభవార్త ప్రకటించింది ప్రభుత్వం.

Breaking News : విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)లో విద్యార్థులకు భారీ శుభవార్త ప్రకటించింది ప్రభుత్వం. తెలంగాణలోని అన్ని జూనియర్ కాలేజీల(Intermediate Colleges)కు సమ్మర్ హాలిడేస్(Summer Holidays) ప్రకటించింది. ఇటీవలే వార్షిక పరీక్షలు ముగియగా.. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం వేసవి సెలవులు ప్రకటించారు. జూన్ 1 వరకు అన్ని ఇంటర్ కాలేజీలకు సమ్మర్ హాలిడేస్ ఉంటాయని, తిరిగి జూన్ 2న కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయని పేర్కొంది. అన్ని కాలేజీలు ఈ ఉత్తర్వులను తప్పక పాటించాలని, సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డ్ హెచ్చరించింది. అదే విధంగా పరీక్ష పేపర్ల స్పాట్ వాల్యుయేషన్ వేగంగా కొనసాగుతోందని.. ఏప్రిల్ మూడవ వారంలో ఇంటర్ విద్యార్థుల ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు అధికారులు.

Next Story