- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. నేటి నుంచే వేసవి సెలవులు !
తెలంగాణ రాష్ట్ర ఇంటర్ విద్యార్థులకు ( Inter Students ) అదిరిపోయే శుభవార్త అందింది. ఇవాల్టి నుంచి తెలంగాణ ( Telangana )

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ఇంటర్ విద్యార్థులకు ( Inter Students ) అదిరిపోయే శుభవార్త అందింది. ఇవాల్టి నుంచి తెలంగాణ ( Telangana ) ఇంటర్ విద్యార్థులకు వేసవి సెలవులు ( summer holidays ) ప్రారంభం కాబోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ అలాగే ప్రైవేట్ ఇంటర్మీడియట్ కాలేజీలకు ( Intermediate colleges )... నేటి నుంచి వేసవి సెలవులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ( Telangana State Intermediate Board ) కూడా అధికారిక ప్రకటన చేసింది.
అంటే ఇవాళ ఉగాది రోజు ( ఉగాది ) నుంచి... దాదాపు 60 రోజుల పాటు.. తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు వేసవి సెలవులు ఉంటాయి. మార్చి 30వ తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకు.. ఈ వేసవి సెలవులు కొనసాగుతాయన్నమాట. మళ్లీ జూన్ 2వ తేదీ నుంచి తెలంగాణ ఇంటర్ కాలేజీలు రీ ఓపెన్ అవుతాయి. అయితే.. ఈ వేసవి సెలవుల నేపథ్యంలో.. ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈ వేసవి సెలవుల్లో ( summer holidays )... ఏ కాలేజీ కూడా.... ప్రత్యేక తరగతులు.. నిర్వహించకూడదని స్పష్టం చేసింది. ఒకవేళ అలా విద్యార్థులను బలవంతంగా తీసుకువచ్చి క్లాసులు చెబితే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇది ఇలా ఉండగా... మార్చి 5వ తేదీ నుంచి మార్చి ౨౫ వ తేదీ వరకు.. తెలంగాణ ఇంటర్ బోర్డు పరీక్షలు ( Inter Board Examinations ) జరిగిన సంగతి తెలిసిందే.






