MLC కవిత అరెస్ట్‌పై సుఖేశ్ చంద్రశేఖర్ సంచలన లేఖ

by Disha Web Desk 2 |
MLC కవిత అరెస్ట్‌పై సుఖేశ్ చంద్రశేఖర్ సంచలన లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై సుఖేశ్ చంద్రశేఖర్ స్పందించారు. మంగళవారం ఉదయం జైలు నుంచి మరో సంచలన లేఖ విడుదల చేశారు. ‘కవిత అక్కయ్య’ అంటూ సంబోధిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘లిక్కర్ కుంభకోణం కేసులో నిజం రుజువైంది. బూటకపు కేసులని.. రాజకీయ ప్రతీకారమని.. ఇన్నాళ్లూ నువ్వు చేసిన వాదన అబద్ధమని రుజువైంది. మీ పార్టీ వేలకోట్లను సింగపూర్, హాంకాంగ్, జర్మనీలో దాచింది. నెయ్యి డబ్బాలంటూ మీరు కథలపై దర్యాప్తు జరుగుతోంది. నన్ను ఎవరూ ఏం చేయలేరని అనుకునేవారు. కానీ, భారత దేశంలో అన్నిటికంటే శక్తివంతమైనది చట్టమే. కవిత అరెస్ట్‌తో అవినీతి పండోరా బాక్స్ తెరుచుకుంది. వేల కోట్ల అవినీతి చేసి విదేశాల్లో దాచిన విషయాలన్నీ బయటకు వస్తాయి.

అవినీతి సూత్రధారి కేజ్రీవాల్‌ను కాపాడేందుకు.. నిజాన్ని దాచే ప్రయత్నం చేయొద్దు. ఈడీ, సీబీఐ విచారణలో భాగంగా త్వరలోనే మిమ్మలి డైరెక్ట్‌గా చూస్తాను అక్కా. సినిమా ఇంకా మిగిలే ఉంది. మా గ్రేటెస్ట్ తీహార్ జైలుకు స్వాగతం అక్కా’ అని లేఖలో సుఖేశ్ పేర్కొన్నారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన సుఖేశ్ చంద్రశేఖర్ ప్రస్తుతం మండోలి జైలులో ఉన్నాడు. ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితపై అనేకసార్లు సంచలన ఆరోపణలు చేశారు. కవితతో తాను చేసిన వాట్సాప్‌ చాట్‌‌తో పాటు అనేక స్క్రీన్ షాట్స్ విడుదల చేసి పొలిటికల్ హీట్ పెంచారు. తాజాగా.. మరోసారి సుఖేశ్ కవిత అరెస్ట్‌పై స్పందించడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.



Next Story

Most Viewed