హైదరాబాద్‌కు పాకిన 'షుగర్‌ డాడీ' కల్చర్! వయసులో చిన్నవారైన యువతులతో రొమాంటిక్ బంధం!!

by Ramesh Naini |   (  Updated:2026-02-09 12:26:09  IST  )

నగరంలో పలువురు బడా వ్యాపారవేత్తలు (Businessmen), ప్రముఖ కంపెనీల సీఈవోలు, ఎండీలు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థికంగా అత్యంత బలమైన స్థితిలో ఉండి, 40 లేదా 50 వయసు పైబడిన వ్యక్తులు.. తమకంటే వయసులో చాలా చిన్నవారైన యువతులతో రొమాంటిక్ బంధాన్ని కొనసాగించడమే ఈ షుగర్ డాడీ కల్చర్.

హైదరాబాద్‌కు పాకిన షుగర్‌ డాడీ కల్చర్! వయసులో చిన్నవారైన యువతులతో రొమాంటిక్ బంధం!!
X

దిశ, డైనమిక్ బ్యూరో: పాశ్చాత్య దేశాలకే పరిమితమైన ఈ వింత పోకడ ఇప్పుడు హైదరాబాద్‌లోనూ వేగంగా విస్తరిస్తోంది. 'డేటింగ్', 'లివిన్ రిలేషన్‌షిప్' వంటి పేర్లతో ఇప్పటికే మారుతున్న నగర జీవనశైలిలో.. తాజాగా 'షుగర్ డాడీ', 'షుగర్ మమ్మీ' కల్చర్ వచ్చి చేరింది. నగరంలో వేల సంఖ్యలో షుగర్ డాడీలు ఉన్నట్లు వస్తున్న వార్తలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి.

ఎవరీ షుగర్ డాడీలు?

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నగరంలో పలువురు బడా వ్యాపారవేత్తలు (Businessmen), ప్రముఖ కంపెనీల సీఈవోలు, ఎండీలు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థికంగా అత్యంత బలమైన స్థితిలో ఉండి, 40 లేదా 50 వయసు పైబడిన వ్యక్తులు.. తమకంటే వయసులో చాలా చిన్నవారైన యువతులతో రొమాంటిక్ బంధాన్ని కొనసాగించడమే ఈ షుగర్ డాడీ కల్చర్. లగ్జరీ లైఫ్ కోరుకునే యువతను వాడుకోవడం, మరోవైపు కొంత మంది యువతలో కష్టపడి పైకి రావడం కంటే.. సులభంగా విలాసవంతమైన జీవితాన్ని (Luxury Life) అనుభవించాలనే కోరిక బలంగా మారుతున్నట్లు తెలుస్తోంది. కెరీర్‌లో త్వరగా ఎదగాలన్నా, ఖరీదైన బహుమతులు పొందాలన్నా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా బతకాలన్నా.. ఇలాంటి షుగర్ డాడీలు, మమ్మీలను ఆశ్రయించడమే మార్గమని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒప్పందం మీద నడిచే బంధం

ఈ వ్యవహారమంతా పూర్తిగా పరస్పర ఒప్పందం (Mutual Understanding) మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో ప్రేమ, ఆప్యాయతల కంటే అవసరాలే ప్రధానం. షుగర్ డాడీ ఆ యువతికి ఆర్థిక భద్రత కల్పిస్తూ, ఆమె ఖర్చులను భరిస్తాడు. ఇందుకు ప్రతిఫలంగా ఆమె నుంచి స్నేహం, సాన్నిహిత్యం, ఎమోషనల్ లేదా ఫిజికల్ సంతృప్తిని పొందుతాడు. నాగరికత పేరుతో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారం వల్ల మానవ సంబంధాలు, సామాజిక విలువలు రోజురోజుకీ దిగజారిపోతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా ప్రభావంతో ఈ కల్చర్ మరింత వేగంగా యువతను ఆకర్షిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రత్యేక వెబ్ సైట్..

ఇలాంటివి నిర్వహించడం కోసం ప్రత్యేక వెబ్ సైట్లు ఉన్నట్లు తెలిసింది. హైదరాబాద్‌లో ఆ వెబ్‌సైట్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న వారు దాదాపు 11 వేల మందికి పైగా ఉన్నట్టు సమాచారం.

Next Story