Ration Cards : అలాంటి రేషన్ కార్డులు రద్దు!

by Muthe.Rajitha |

నకిలీ రేషన్ కార్డుదారులకు(Ration Card Holders) సర్కార్ జలక్ ఇవ్వనుంది.

Ration Cards : అలాంటి రేషన్ కార్డులు రద్దు!
X

దిశ, వెబ్ డెస్క్ : నకిలీ రేషన్ కార్డుదారులకు(Ration Card Holders) సర్కార్ జలక్ ఇవ్వనుంది. గత 6 నెలలుగా రేషన్ సరుకులు తీసుకొని వారి కార్డులను పరిశీలించి తొలగించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 6 నెలల కంటే ఎక్కువ కాలం రేషన్ తీసుకొని కార్డుదారులు రాష్ట్రంలో 1.59 లక్షల మంది ఉన్నట్టు గుర్తించారు అధికారులు. వీటిపై విచారణ చేసి, అనర్హులు అని తేలితే కార్డులు రద్దు చేయాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పటికే 80 శాతం కార్డులపై విచారణ పూర్తవగా.. వాటిలో 30 శాతం అనర్హులే అని తేలినట్టు సమాచారం. వీరిలో కొంతమంది గత కొన్ని నెలలుగా రేషన్ తీసుకొనివారు ఉండగా.. కొంతమంది నకిలీ ధృవీకరణ పత్రాలు సమర్పించిన వారు కూడా ఉన్నారు.

దీంతో ఈ కార్డులన్నీ రద్దవనున్నాయి. ఇక రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకేసారి 3 నెలల రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రేషన్ షాపుల ముందు భారీ క్యూ ఉంటోంది. 3 నెలల సరుకులు ఒకేసారి తీసుకునే ప్రక్రియలో 3 సార్లు బయోమెట్రిక్ తీసుకోవాల్సి రావడం, ఈ పాస్ సాఫ్ట్ వేర్ లో తీవ్ర సమస్యలు ఎదురవుతూ ఉండటంతో లబ్దిదారులు షాపుల గంటలు గంటలు వేచి చూడాల్సి వస్తోంది.

Next Story