- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళనాడు ‘ఈ-గవర్నెన్స్’ మోడల్‌ను స్టడీ చేయండి.. అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్రం కీలక సూచన
‘సింపుల్ ఈ-గవర్నెన్స్’ ద్వారా ప్రజలకు మరింత సరళతరమైన, మెరుగైన సేవలు అందించాలని కేంద్ర కేబినెట్ సెక్రెటరీ డాక్టర్ టి.వి. సోమనాథన్ రాష్ట్రాల సీఎస్‌లను కోరారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘సింపుల్ ఈ-గవర్నెన్స్’ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని కేంద్ర కేబినెట్ సెక్రెటరీ డాక్టర్ టి.వి. సోమనాథన్ ఆయా రాష్ట్రాల చీఫ్ సెక్రెటరీలను కోరారు. సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడుతూ.. తమిళనాడు ప్రభుత్వం అనుసరిస్తున్న సింపుల్ ఈ-గవర్నెన్స్ విధానాన్ని ఇతర రాష్ట్రాలు కూడా అధ్యయనం చేయాలన్నారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న నిబంధనల మేరకు ప్రజలకు మరింత సరళతరమైన, మెరుగైన ప్రభుత్వ సేవలను అందించేందుకు ప్రయత్నించాలని సూచించారు.ః
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణా రావు తెలంగాణలో అమలు చేస్తున్న ఈ-గవర్నెన్స్ విధానాలను వివరించారు. ప్రజలకు పారదర్శకంగా, సులభతరమైన పౌర సేవలను అందిస్తున్నామని.. ఎప్పటికప్పుడు వివిధ విభాగాల వారీగా ఆన్‌లైన్ డ్యాష్ బోర్డుల ద్వారా వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. మున్సిపల్, పరిశ్రమలు, విద్య, విద్యుత్, రెవెన్యూ తదితర శాఖల్లో ఈ-గవర్నెన్స్ ద్వారా అందిస్తున్న సేవలను ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణలో సాగుతున్న ఈ-గవర్నెన్స్ విధానాలపై స్పందించిన టి.వి. సోమనాథన్.. రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలను అభినందించారు.
ఈ సందర్భంగా సీఎస్ కే. రామకృష్ణా రావు మాట్లాడుతూ.. తమిళనాడు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను కూడా అధ్యయనం చేసి, ప్రజలకు ఎలాంటి ఆర్థిక భారం, ఇతర ఇబ్బందులు కలగకుండా రాష్ట్రంలో ఈ-గవర్నెన్స్ విధానాల్లో అవసరమైన మార్పులు చేస్తామన్నారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో రాష్ట్ర స్పెషల్ సీఎస్ నవీన్ మిట్టల్, ముఖ్య కార్యదర్శులు యోగితా రాణా, షికా గోయల్, సెక్రెటరీలు రఘునందన్ రావు, ఇ. శ్రీధర్, అనితా రామచంద్రన్, హౌసింగ్ ఎండీ. వీ.పీ. గౌతమ్, సెర్ప్ సీఈవో దివ్య తదితరులు పాల్గొన్నారు.






