నాణ్యతలేని ఆహారం పెడుతున్నారని ఓయూలో విద్యార్థుల నిరసన

by Ajay Maddhiboyina |

కల్తీ ఆహారం పెడుతున్నారంటూ ఓయూలో విద్యార్థులు నిరసనకు దిగారు. యూనివర్సిటీలోని గోదావరి హాస్టల్ వద్ద ఆహారాన్ని తీసుకువచ్చి రోడ్డుపై పెట్టి ఆందోళన చేపట్టారు. ఆహారం బాలేదని చెబితే ఫుడ్ కాంట్రాక్టర్ ఏం చేసుకుంటారో చేసుకోండని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాణ్యతలేని ఆహారం పెడుతున్నారని ఓయూలో విద్యార్థుల నిరసన
X

దిశ‌, వెబ్ డెస్క్: కల్తీ ఆహారం పెడుతున్నారంటూ ఓయూలో విద్యార్థులు నిరసనకు దిగారు. యూనివర్సిటీలోని గోదావరి హాస్టల్ వద్ద ఆహారాన్ని తీసుకువచ్చి రోడ్డుపై పెట్టి ఆందోళన చేపట్టారు. ఆహారం బాలేదని చెబితే ఫుడ్ కాంట్రాక్టర్ ఏం చేసుకుంటారో చేసుకోండని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరం లేకపోతే మీరు మార్పించుకోండని చెబుతున్నాడని అన్నారు. నాణ్యత లేని కల్తీ ఆహారం పెడుతున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు నాణ్యమైన ఆహారం అందించాలని కోరారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు.

Next Story