నీట్ పరీక్ష రద్దు కేంద్రం విద్యకేంద్రీకరణ ఫలితమే : ఎస్ఎఫ్ఐ

by Naga Rani Yarlagadda |

కేంద్ర ప్రభుత్వం విద్యను కేంద్రీకరించడం వల్లే నీట్ పరీక్షా విధానం అభాసుపాలవుతోందని, తక్షణమే ఎన్‌టీఏను రద్దు చేసి రాష్ట్రాలకే ప్రవేశపరీక్షలు నిర్వహించుకునే హక్కు కల్పించాలని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.

నీట్ పరీక్ష రద్దు కేంద్రం విద్యకేంద్రీకరణ ఫలితమే  : ఎస్ఎఫ్ఐ
X
  • ఎన్టీఏ రద్దు చేసి, రాష్ట్రాలకు పరీక్ష నిర్వహించుకునే హక్కు కల్పించాలి : ఎస్ఎఫ్ఐ

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం విద్యను కేంద్రీకరించడం వల్లే నీట్ పరీక్షా విధానం అభాసుపాలవుతోందని, తక్షణమే ఎన్‌టీఏను రద్దు చేసి రాష్ట్రాలకే ప్రవేశపరీక్షలు నిర్వహించుకునే హక్కు కల్పించాలని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర అధ్యక్షులు ఎస్. రజినీకాంత్, కార్యదర్శి టి. నాగరాజు ఒక ప్రకటన విడుదల చేశారు. మే 3న దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడం, ఎన్‌టీఏ వైఫల్యాల వల్ల పరీక్ష రద్దు కావడంతో సుమారు 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వరుసగా పేపర్ లీకులు అవుతున్నా కేంద్రం కఠిన చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ, కేంద్రం రాష్ట్రాల హక్కులను లాక్కొని విద్యా కేంద్రీకరణకు పాల్పడుతోందని ఎస్ఎఫ్ఐ నేతలు విమర్శించారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, ఎక్కడో ఒక రాష్ట్రంలో పేపర్ లీక్ అయితే దేశవ్యాప్తంగా విద్యార్థులు నష్టపోవాల్సి వస్తోందన్నారు. గతంలో నీట్, నెట్ పరీక్షలు లీకైనప్పుడే ఎన్‌టీఏ పనితీరుపై అనుమానాలు వ్యక్తమైనా కేంద్రం సరిదిద్దలేదని వాపోయారు. నీట్ పేపర్ లీకేజీపై ఉన్నత స్థాయి విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Next Story