- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థిని స్కూలుకు పంపడంలేదని ఇంటిముందు ధర్నా!
by Ajay Maddhiboyina |
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. విద్యార్థిని తల్లిదండ్రులు స్కూలుకు పంపండంలేదని వారి ఇంటిముందు స్కూల్ టీచర్లు, పిల్లలు నిరసనకు దిగారు.

X
దిశ, వెబ్ డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. విద్యార్థిని తల్లిదండ్రులు స్కూలుకు పంపండంలేదని వారి ఇంటిముందు స్కూల్ టీచర్లు, పిల్లలు నిరసనకు దిగారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నిమ్మలగూడెంలో చోటు చేసుకుంది. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థి దాదాపు వారం రోజులుగా వెళ్లడంలేదు.
దీనిపై టీచర్లు తల్లిదండ్రులను ప్రశ్నించినా సరైన సమాధానం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు బాలుడి ఇంటి వద్దకు వెళ్లి బైఠాయించారు. దీంతో సోమవారం నుండి బాలుడిని తప్పకుండా పంపిస్తామని తల్లిదండ్రులు హామీ ఇచ్చారు. ఇక ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవ్వడంతో ఉపాధ్యాయులు చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇలాంటి టీచర్లు సమాజానికి అవసరం అని ప్రశంసలు కురిపిస్తున్నారు.
Next Story






