పరుష పదజాలంతో రేవంత్‌కు స్ట్రాంగ్ KTR వార్నింగ్

by velandi.Saikiran |   (  Updated:2026-02-08 19:47:26  IST  )

పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మున్సిపాలిటీ కేంద్రంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భారీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

పరుష పదజాలంతో రేవంత్‌కు స్ట్రాంగ్ KTR వార్నింగ్
X

దిశ‌, వెబ్ డెస్క్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ( CM Revanth Reddy) ఉద్దేశించి మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (KTR) పరుష పదజాలంతో వార్నింగ్ ఇచ్చారు. మొన్న కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ కేటీఆర్ కూడా రెచ్చిపోయారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే, సీఎం రేవంత్ రెడ్డి భ‌ర‌తం ప‌డ‌తామ‌ని వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్‌ను అన్ని మాటలు అనడానికి ఎవ‌రు నువ్వు ? అంటూ అంటూ నిల‌దీశారు. కేసీఆర్ తెలంగాణ ( Telangana) కోసం కోట్లాడుతున్నప్పుడు, నువ్వు టీడీపీలో ( tdp Party) ఉన్నావంటూ చుర‌క‌లు అంటించారు కేటీఆర్.

పరుష పదజాలంతో రేవంత్‌కు స్ట్రాంగ్ KTR వార్నింగ్

పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మున్సిపాలిటీ కేంద్రంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భారీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణం అంతా గులాబీ జెండాలతో, కార్యకర్తల నినాదాలతో మార్మోగింది. ఎటు చూసినా గులాబీ జోష్ కనిపించడంతో తొర్రూరు గడ్డ గులాబీ అడ్డాగా మారిందని కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఈ సంగతి ప్రజలు గమనిస్తున్నారని గుర్తు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని కేటీఆర్ ఆరోపించారు. “మా ఆడబిడ్డలకు నెలకు రూ.2500 ఇస్తానని మోసం చేశావు. వృద్ధాప్య పెన్షన్లు రూ.4000 ఇస్తానని మోసం చేశావు. ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తానని మోసం చేశావు.

ఆరు గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తానని దేవుళ్లపై ఒట్టు వేసి మాట తప్పావు. ఇలా చెప్పుకుంటూ పోతే 420 హామీలు ఎక్కడ పోయినాయి రేవంత్ రెడ్డి అని నిలదీశారు. ఒక మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవాలి అంటూ తీవ్రంగా మండిపడ్డారు.ప్రజలు కాంగ్రెస్ మోసాన్ని అర్థం చేసుకున్నారని కేటీఆర్ అన్నారు. “మోసపూరిత హామీలిచ్చి గద్దెనెక్కిన సంగతి ప్రజలందరూ గమనిస్తున్నారని, మళ్లీ మోసపోవడానికి సిద్ధంగా లేమని ప్రజలు స్పష్టంగా చెబుతున్నారు” అని తెలిపారు. తెలంగాణ మొత్తం ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. “తెలంగాణ అభివృద్ధి కొనసాగాలంటే గులాబీ జెండానే ఎగరాలని, కాంగ్రెస్ మాటలు నమ్మితే మళ్లీ లైన్లలో నిలబడే పాత రోజులు తిరిగి వస్తాయి” అని గుర్తు చేశారు. తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ వార్డుల్లో బిఆర్ఎస్ ( BRS) అభ్యర్థులు గెలిస్తే అది దయాకర్ రావు గెలుపే కాదు, కేసీఆర్ ( KCR) గెలుపుగా భావిస్తామని ,తొర్రూరులో గులాబీ జెండానే ఎగరాలని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, స్థానిక నేతలు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. క్లిక్

Next Story