రేపు ట్రాన్స్​కో, జెన్​కో సీఎండీలకు మరోసారి సమ్మె నోటీసుల జారీ

by velandi.Saikiran |   (  Updated:2025-06-18 17:36:38  IST  )

తెలంగాణ విద్యుత్​సంస్థలలో పని చేస్తున్న ఆర్టిజన్ ​ఉద్యోగులను కన్వర్షన్​చేయించేందుకు తెలంగాణ విద్యుత్​ ఆర్టిజన్స్ ​జేఏస

రేపు ట్రాన్స్​కో, జెన్​కో సీఎండీలకు మరోసారి సమ్మె నోటీసుల జారీ
X

ట్రాన్స్​కో, జెన్​కో సీఎండీలకు

మరో సారి సమ్మె నోటీసుల జారీ

== తెలంగాణ విద్యుత్​ ఆర్టిజన్స్ ​కన్వర్వన్ ​జేఏసీ

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ విద్యుత్​సంస్థలలో పని చేస్తున్న ఆర్టిజన్ ​ఉద్యోగులను కన్వర్షన్​చేయించేందుకు తెలంగాణ విద్యుత్​ ఆర్టిజన్స్ ​జేఏసీ మరో సారి సమ్మె దిశగా అడుగులు వేస్తోంది. ట్రాన్స్​కో సీఎండీ కృష్ణ భాస్కర్​తో పాటు జెన్​కో, టీజీ ఎస్​పీడీసీఎల్​, టీజీ ఎన్​పీ డీసీఎల్​, యాజమాన్యాలను కూడా కలిసి గురువారం సమ్మె నోటీసులు ఇస్తున్నామని తెలంగాణ విద్యుత్​ ఆర్టిజన్స్ కన్వర్షన్ ​​జేఏసీ స్పష్టం చేసింది. ఈ మేరకు జేఏసీ కన్వీనర్​కే. ఈశ్వర్​రావు, కన్వీనర్​ఎంఏ వజీర్​ల నేతృత్వంలో ఆర్టిజన్​ ఉద్యోగుల కుటుంబాలతో కలిసి బుధవారం ఈ మేరకు హైదరాబాద్​ ఇందిరాపార్క్​ వద్ద భారీ బహిరంగ సభను నిర్వహించింది.

విద్యుత్​సంస్థలపై ఆర్థిక భారం పడని ఆర్టిజన్స్​ కన్వర్షన్​ను వెంటనే చేపట్టాలని డిమాండ్​చేస్తూ కుటుంబ సభ్యులతో బహిరంగ సభకు హాజరైనారు. ఉస్మానియా వర్సిటీ ప్రొఫెసర్​కే. నాగేశ్వర రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ విద్యుత్​శాఖలో పని చేస్తున్న 20 వేల మంది ఆర్టిజన్​కార్మికులను వారి వారి విద్యార్హతలను బట్టి ప్రభుత్వ ఉద్యోగిగా కన్వర్షన్​చేయాలని డిమాండ్​ చేశారు. వందల కుటుంబాలు ఈ రంగంలో పని చేస్తున్నా ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకోక పోవడం సరికాదన్నారు.

ఈశ్వర్​రావు, ఎంఏ. వజీర్​లు మాట్లాడుతూ 1998 లో విద్యుత్​సంస్థలలో కాంట్రాక్టు కార్మికులుగా చేరిన ఆర్టిజన్లు ప్రస్తుత కాంగ్రెస్​ప్రభుత్వంపై కొండంత ఆశలు పెట్టుకున్నారని, వారి ఆశలను వడియాసలు చేయవద్దన్నారు. ప్రస్తుతం విద్యుత్​శాఖలో పని చేస్తున్న ఆర్టిజన్స్​ఉద్యోగులకు వారి విద్యార్హతలను బట్టి జూనియర్​లైన్​మెన్​, సబ్​ఇంజనీర్​, జూనియర్​అసిస్టెంట్​, సబార్డినేట్​ పోస్టులను ఆర్టిజన్స్​తో మాత్రమే కన్వర్షన్​చేయాలని ప్రభుత్వానికి , విద్యుత్​యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. సమస్య తీవ్రతను బట్టి జేఏసీతో చర్చలు జరపాలని వారు డిమాండ్​చేశారు.

Next Story