- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజా ప్రభుత్వం ప్రతిష్టను దిగజారుస్తున్నారు.. ఈ పోలీసు బాసు నివేదికలపై పోలీసు వర్గాల్లో హాట్ హాట్ చర్చ..
ప్రజా ప్రభుత్వంలో ప్రజా భద్రతతో పాటు ప్రజలకు నిరంతరం రక్షణగా, అండగా పోలీసులు ఉండాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

దిశ, సిటీక్రైం : ప్రజా ప్రభుత్వంలో ప్రజా భద్రతతో పాటు ప్రజలకు నిరంతరం రక్షణగా, అండగా పోలీసులు ఉండాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్ష మేరకు గ్రేటర్ హైదరాబాద్ లోని ఓ పోలీసు కమిషనరేట్ పోలీసు బాసు వ్యవహరిస్తుండడంతో పోలీసు వర్గాల్లో ఇప్పుడు కలవరాన్ని రేపుతోంది. వివాదాస్పదంగా వ్యవహరించే పోలీసు అధికారుల్లో ఆ కమిషనర్ యాక్షన్ గుబులు రేపుతోంది. ప్రజలకు ప్రశాంత వాతావరణాన్ని అందించే విధంగా శాంతి భద్రతలను నిర్వహించాలని, స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారుడికి పోలీసు సేవలను అందాలనే లక్ష్యంతో ఈ పోలీసు బాసు రూల్ బుక్ ను కచ్చితంగా పాటిస్తుండడంతో నిర్లక్ష్యంగా పని చేసే అధికారుల్లో ఆందోళనను రేపుతోంది.
వివాదాస్పదంగా, రూల్ బుక్ కు వ్యతిరేకంగా పని చేసి సామాన్యుడికి ఇబ్బందులు తెచ్చే విధంగా పని చేసే అధికారుల పైనా ఏ ఫిర్యాదు వచ్చినా ఈ కమిషనర్ దాని పై పూర్తి విచారణ జరిపించి పాయింట్ టూ పాయింట్ రిపోర్టులను రూపొందిస్తుండడంతో తప్పు చేసే అధికారుల్లో ఇరుకుపోయాం రా బాబు అంటూ వణికిపోతున్నారు. తాము తప్పు చేయలేదని బుకాయించేందుకు అవకాశమివ్వకుండా అన్ని విషయాలను ఆన్ పేపర్ మీద పెడుతుండడంతో ఆఫీసర్స్ కు దిక్కుతోచడం లేదు.
తెలిసి చేసిన తప్పును క్షమించను
సాధారణంగా తెలియకుండా జరిగే తప్పులను క్షమించవచ్చు....కాని తెలిసి చేసిన తప్పును అసలు క్షమించవద్దనే సిద్ధాంతాన్ని ఈ పోలీసు కమిషనర్ పెట్టుకున్నట్లు పోలీసు వర్గాల్లో చర్చ ఉంది. దీంతో ఈ పోలీసు కమిషనరేట్ లో తెలిసి తప్పు చేసిన అధికారుల పై వచ్చిన ఫిర్యాదుల మీద ఈ పోలీసు బాసు పక్కా విచారణ జరిపించి నివేదికలు తయారు చేశారు. తన పరిధిలో ఉన్న పరిమితులతో అలాంటి తప్పులు చేసిన అధికారుల పై బదిలీ వేటుతో పాటు శాఖ పరమైన చర్యలు తీసుకుంటుండడడంతో అధికారుల్లో కొంత క్రమశిక్షణ పెరిగిందని స్పష్టమవుతుంది. ఇక తన పరిధికి మించిన అధికారుల పై చర్యల కోసం డీజీపీ, ఇంటలిజెన్స్ ఛీప్ కు ఈ ఉన్నతాధికారుల మీద పాయింట్ టూ పాయింట్ ఆధారాలతో రిపోర్టులు రూపొందించారని తెలిసింది. ఈ అధికారుల వ్యవహార శైలితో ప్రజా ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడంతో పాటు పోలీసు ప్రతిష్ఠ ను దిగజార్చే విధంగా ఉందని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారుం.
కాబట్టీ ఈ అధికారుల పై చర్యలు తీసుకోవాలని పోలీసు కమిషనరేట్ పరిధిలోని పలువురు డీసీపీ ల మీద ఈ పోలీసు బాసు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నివేదిక ఆధారంగా వివాదాస్పదంగా మారిన డీసీపీలు, ఏసీపీల పై డీజీపీ చర్యలు తీసుకోవాల్సి ఉంది. ల్యాండ్ సెటిల్మెంట్ లు, అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం వంటి ఆరోపణల పై పోలీసులు బాసు కు వచ్చిన ఫిర్యాదుల నేపధ్యంలో పక్కా విచారణను చేపట్టినట్లు పోలీసు వర్గాల్లో ప్రచారం ఉంది. ఈ పోలీసు బాసు ఇచ్చిన నివేదికలను పరిశీలిస్తే ప్రజా ప్రభుత్వం ఈ ఉన్నతాధికారులకు ఎక్కడా కూడా పోస్టింగ్ లు ఇవ్వదని పోలీసులు వర్గాలంటున్నాయి. కాని ఒత్తిడికి తలొగ్గితే ఇలాంటి వివాదాస్పద అధికారుల పని తీరుతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయమని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.






