Minister Seethakka : మీ పొరపాట్లతో ప్రభుత్వాన్ని బద్నాం చేస్తే కఠిన చర్యలు : మంత్రి సీతక్క

by Y. Venkata Narasimha Reddy |

ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకా(Public Welfare And Development Schemes)ల అమలులో భాగంగా ఉద్యోగు(Employees)లు పొరపాట్లు(Mistakes) చేసి ప్రభుత్వా(Government)నికి చెడ్డపేరు(Bad Name)తెస్తే కఠిన చర్య(Strict Measures)లు తప్పవని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka)స్పష్టం చేశారు.

Minister Seethakka : మీ పొరపాట్లతో ప్రభుత్వాన్ని బద్నాం చేస్తే కఠిన చర్యలు : మంత్రి సీతక్క
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకా(Public Welfare And Development Schemes)ల అమలులో భాగంగా ఉద్యోగు(Employees)లు పొరపాట్లు(Mistakes) చేసి ప్రభుత్వా(Government)నికి చెడ్డపేరు(Bad Name)తెస్తే కఠిన చర్య(Strict Measures)లు తప్పవని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka)స్పష్టం చేశారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగుల ఆన్లైన్ గ్రీవెన్స్ సమావేశానికి సీతక్క వర్చువల్ గా హాజరయ్యారు.

ములుగులో గవర్నర్ పర్యటనలో పాల్గొనేందుకు వెలుతున్న సీతక్క ప్రయాణంలోనే ఉద్యోగుల సర్వీస్ సమస్యలు విన్నారు. అధికారులకు దిశా నిర్దేశం చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి వినూత్న పద్ధతిని అవలంబిస్తున్నామని మంత్రి తెలిపారు. వ్యక్తిగతంగా మీరు సచివాలయం చుట్టూ తిరగకుండానే మీ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. శాఖ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలు తక్షణం తీసుకుంటామని, మంత్రివర్గం, పైస్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యలను నివేదించి పరిష్కారానికి కృషి చేస్తామని హమీ ఇచ్చారు.

అయితే కొందరు అధికారులు అనాలోచితంగా వ్యవహరిస్తున్నారని, ఇందుకు మంచిర్యాలలో వృద్ధురాలి పింఛన్ కట్ చేసిన ఘటనను సీతక్క ప్రస్తావించారు. విచక్షణ మానవత్వం లేకుండా కొందరు సిబ్బంది పనిచేస్తున్నారని, మీరు ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకొని... ప్రభుత్వ మీద రుద్ది చెడ్డపేరు తెస్తే చర్యలు తప్పవన్నారు. పొరపాటు దొర్లితే సరిదిద్దుకోవాలని, ఉద్దేశపూర్వకంగా తప్పు చేస్తే.. విచారణ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని, సస్పెన్షన్ తో పాటు అవసరమైతే సర్వీస్ నుంచి తొలగిస్తామని ప్రకటించారు.

Next Story