HYD: మరోసారి రెచ్చిపోయిన వీధి కుక్కలు

by Disha Web Desk 2 |
HYD: మరోసారి రెచ్చిపోయిన వీధి కుక్కలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో వీధి కుక్కలు మరోసారి రెచ్చిపోయాయి. ఆదివారం కుక్కల దాడిలో మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. కుత్బుల్లాపూర్ పరిధిలో సూరారంలోని శ్రీరామ్​నగర్ కాలనీలో ఆడుకుంటున్న సాయిచరిత్(12)పై వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ క్రమంలో సాయిచరిత్ కూడా ధైర్యం చేసి ప్రతిఘటించడంతో కుక్క అక్కడి నుంచి వెళ్లిపోయింది. తీవ్ర రక్త స్రావంతో సాయిచరిత్ పరుగులు తీస్తూ ఇంట్లోకి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. దీంతో వారు వెంటనే నల్లకుంటలోని ఓ ఆసుపత్రిలో బాలుడికి చికిత్స అందించారు.

దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఇవాళ ఉదయం 10:30 సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనపై కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడే ఇలాంటి ఘటనలు ఈ ప్రాంతంలో జరుగుతున్నాయని వాపోతున్నారు. అధికారులు మాత్రం మొద్దు నిద్ర వీడడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతోనైన అధికారులు మేల్కొని కుక్కల బారి నుంచి తమ పిల్లలను కాపాడాలని కాలనీ వాసులు వేడుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



Next Story