హడలెత్తిస్తున్న వీధి కుక్కలు.. HYDలో మరోచోట

by Gantepaka Srikanth |

హడలెత్తిస్తున్న వీధి కుక్కలు.. HYDలో మరోచోట

హడలెత్తిస్తున్న వీధి కుక్కలు.. HYDలో మరోచోట
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో వీధి కుక్కలు(Stray Dog) హడలెత్తిస్తున్నాయి. పిల్లలు, మహిళలు, వృద్ధులు ఆందోళనకు గురవుతున్నారు. కుక్కల బెడద తొలగించాలని ప్రభుత్వం ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా ఫలితాలను ఇవ్వడం లేదు. తాజాగా యూసుఫ్‌గూడలో రెండేళ్ల బాలుడిపై వీధి కుక్క దాడికి యత్నించింది. లక్ష్మీనరసింహనగర్‌లో మన్వీత్‌ నందన్‌ ఇంటి ముందు ఆడుకుంటుండగా.. బాలుడిపైకి వీధికుక్క దూసుకెళ్లింది. చిన్నారిని కరిచేప్రయత్నం చేసింది. అక్కడే ఉన్న బాలుడి తాత అప్రమత్తమై కర్రతో కొట్టడంతో వీధికుక్క అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో చిన్నారికి పెను ప్రమాదం తప్పింది. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, ఇటీవలే వీధి కుక్కల సంరక్షణపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం జారీ చేసింది. వీధి కుక్కల సంరక్షణ విషయంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించాలని ఆదేశించింది.

Next Story