- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విచిత్రమైన దొంగ.. అవే టార్గెట్‌గా దొంగతనాలు.. సీసీకెమెరాల్లో షాకింగ్ దృశ్యాలు!
సాధారణంగా దొంగలు నగలు, డబ్బులు, తదితర విలువైన వస్తువులపై కన్నేసి వాటినే దొంగలించటం చూస్తుంటాం.

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా దొంగలు నగలు, డబ్బులు, తదితర విలువైన వస్తువులపై కన్నేసి వాటినే దొంగలించటం చూస్తుంటాం. కొన్నిసార్లు కొంతమంది దొంగలు విచిత్రమైన వస్తువులను కూడా దొంగిలిస్తారు, అవి ఎవరూ ఊహించని వస్తువులై ఉంటాయి. తాజాగా తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఇలాంటి ఆసక్తికరమైన దొంగతనం వెలుగుచూసింది. ఓ దొంగ విద్యార్థుల పుస్తకాలను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్లితే.. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో గత కొన్ని రోజులుగా విద్యార్థులు పుస్తకాలు మాయమవుతుండటం తీవ్ర కలకలంగా మారింది. విద్యార్థులు తరగతుల్లో లేని వేళ లేదా విరామ సమయాల్లో, వారి బ్యాగుల్లో పెట్టిన పుస్తకాలు అదృశ్యమవుతున్నాయి.
మొదట చిన్నగా మొదలైన ఈ ఘటనలు ఇప్పుడు తరచూ జరుగుతుండటంతో, విద్యార్థులు కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. దీంతో యాజమాన్యం సీసీ కెమెరాలను పరిశీలించింది. అందులో ఓ వ్యక్తి కాలేజీ ఆవరణలోకి చొరబడి పుస్తకాలు ఎత్తుకుపోతున్న దృశ్యాలు బయటపడ్డాయి. అతడు స్పష్టంగా పుస్తకాలకే టార్గెట్ చేసినట్లు ఫుటేజ్ ఆధారంగా తెలుస్తోంది. ఈ విషయంపై కాలేజీ యాజమాన్యం పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయటంతో పోలీసులు ఈ విచిత్ర దొంగతనంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, ఈ ఘటనపై విద్యార్థులు స్పందిస్తూ.. కాలేజీకి ప్రహరీ గోడ లేకపోవడమే ఇందుకు కారణమని అభిప్రాయపడుతున్నారు. ఎవరికైనా సులభంగా ఆవరణలోకి ప్రవేశించే వీలుండటంతో భద్రతా లోపాలపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






