- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral: సీఎం రేవంత్ రెడ్డి వస్తేనే పెళ్లి! స్థానిక ఎమ్మెల్యేకి పెళ్లి కొడుకు వింత లేఖ
ఓ పెళ్లి కొడుకు వింత లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి వచ్చినప్పుడే పెళ్లి ముహూర్తం పెట్టుకుంటానని స్థానిక ఎమ్మెల్యేకు లేఖ రాశాడు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఓ పెళ్లి కొడుకు వింత లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వచ్చినప్పుడే పెళ్లి ముహూర్తం పెట్టుకుంటానని స్థానిక ఎమ్మెల్యేకు లేఖ రాశాడు. (Khammam Congress worker) ఖమ్మం జిల్లాలో పెళ్ళికొడుకు (ఖమ్మం కాంగ్రెస్ మండల యూత్ లీడర్) భూక్య గణేష్ లేఖలో ఈ విధంగా అభ్యర్థించారు. సీఎం రేవంత్ రెడ్డి నా పెళ్లికి రావాలని, ఆయన ఏ రోజు వస్తె అదే రోజు నా పెళ్లి డేట్ ఫిక్స్ చేస్తానని అంటూ వైరా ఎమ్మెల్యేకి లేఖ రాశారు.
పెళ్ళికొడు అభ్యర్థనకు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ సైతం సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం. ఇక, ఇందుకు సంబంధించిన లేఖ నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాంగ్రెస్ కార్యకర్త పెళ్లికి సీఎం రేవంత్ రెడ్డి వస్తే బాగుంటుందని కాంగ్రెస్ కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.






