జగిత్యాల జిల్లాలో విచిత్ర ఘటన.. మంత్రాలు వాపస్ తీసుకోవాలంటూ ఊరేగింపు

by Ajay Maddhiboyina |

జ‌గిత్యాల జిల్లా మోతె గ్రామంలో విచిత్ర‌మైన ఘ‌ట‌న చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఈ నెల 12న పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య చేసుకుంది.

జగిత్యాల జిల్లాలో విచిత్ర ఘటన.. మంత్రాలు వాపస్ తీసుకోవాలంటూ ఊరేగింపు
X

దిశ, వెబ్ డెస్క్: జ‌గిత్యాల జిల్లా మోతె గ్రామంలో విచిత్ర‌మైన ఘ‌ట‌న చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఈ నెల 12న పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దీంతో గ్రామ స్మ‌శాన‌వాటికలో కుటుంబ స‌భ్యులు యువ‌తి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. అయితే మ‌రుస‌టి రోజు వెళ్లి చూడ‌గా యువ‌తి మృతదేహం స‌గ‌మే ద‌హ‌న‌మై క‌నిపించింది. దీంతో కుటుంబ స‌భ్యులు మ‌ళ్లీ క‌ర్ర‌లు పేర్చి పూర్తిగా ద‌హ‌నం చేశారు.

అయితే అక్క‌డ‌ క్షుద్రపూజ‌లు చేసిన‌ట్టు ఆన‌వాళ్లు క‌నిపించాయి. దీంతో కుటుంబ స‌భ్యులు త‌మ కుమార్తె మంత్రాల వ‌ల్లే చ‌నిపోయింద‌ని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. కుటుంబ స‌భ్యుల‌తో పాటు వారి బంధువులు మంత్రాల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని హెచ్చ‌రిస్తూ గ్రామంలో ఊరేగింపు చేశారు. డ‌ప్పుల‌తో కుటుంబ స‌భ్యులు క‌ర్ర‌లు ప‌ట్టుకుని గ్రామంలో తిరిగారు. క్షుద్రపూజ‌లు వెన‌క్కి తీసుకోక‌పోతే చంపేస్తామ‌ని బెదిరింపుల‌కు పాల్ప‌డ్డారు. video

Next Story