- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సొంత డబ్బా ఆపండి.. ప్రభుత్వ పథకాలను ప్రమోట్ చేయండి : సీఎం రేవంత్‌రెడ్డి
కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (PAC) సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (PAC) సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు, సోషల్ మీడియాలో వారి ప్రచార శైలిపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైఫల్యాన్ని ఎండగడుతూ సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గాల ప్రజాప్రతినిధులకు గట్టి క్లాస్ తీసుకున్నారు.
సొంత ప్రచారం కాదు.. ప్రభుత్వ పనితీరు ముఖ్యం
సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కొందరు ఎమ్మెల్యేలు ప్రభుత్వ పథకాలను, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేయడం పక్కన పెట్టి, కేవలం తమ వ్యక్తిగత ఇమేజ్ కోసమే తాపత్రయపడుతున్నారని మండిపడ్డారు. "ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో కేవలం తమ సొంత డబ్బా కొట్టుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీ వ్యక్తిగత ప్రచారం కంటే ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు, ఇతర గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం ముఖ్యం. ఇకనైనా ఆ సొంత డబ్బా ఆపి, ప్రభుత్వ పథకాలను ప్రమోట్ చేయడంపై దృష్టి పెట్టండి" అని సీఎం స్పష్టం చేశారు.
ఏకపక్ష నిర్ణయాలపై హెచ్చరిక
కొంతమంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పార్టీ సీనియర్లను, స్థానిక నాయకులను కలుపుకుపోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులపై కూడా సీఎం స్పందించారు. పార్టీలో అందరినీ సమన్వయం చేసుకుంటూ వెళ్లాలని, ఏకపక్ష ధోరణి వీడకపోతే నష్టపోతామని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ప్రతి ఎమ్మెల్యే సోషల్ మీడియా ఖాతాలో ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారమే ప్రధానంగా కనిపించాలని, దీనిపై క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.






