- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Operation Kagaru: కర్రిగుట్టల్లో హై టెన్షన్.. సంచలన లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ
కర్రిగుట్టల్లో మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు చేపట్టిన కూంబింగ్ టెన్షన్ పుట్టిస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: మావోయిస్టులను ఏరివేయడమే లక్ష్యంగా తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లోని కర్రిగుట్టల్లో (Karriguttalu) భద్రతబలగాల కూంబింగ్ కొనసాగుతోంది. వేల సంఖ్యలో కర్రిగుట్టలను చుట్టుముట్టడంతో అక్కడ యుద్ధవాతావరణం కనిపిస్తోంది. ఏ క్షణంలో ఎలాంటి గుట్టల్లోనుంచి వస్తోందో అనేది ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో కర్రిగుట్ట ఆపరేషన్ వెంటనే ఆపి శాంతి చర్చలకు ముందుకురావాలని మావోయిస్టులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బస్తర్ మావోయిస్టు (Maoist Party) ఇన్ చార్జి రూపేశ్ (Rupesh) పేరుతో తాజాగా ఓ ప్రకటన కలకలం రేపుతోంది.
నెల రోజులు వాయిదా వేయండి:
శాంతి చర్చల ద్వారా సమస్య పరిష్కారం కావాలని అందరూ కోరుకుంటున్నారు. ఇందుకు మా పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని రూపేశ్ లేఖలో పేర్కొన్నారు. శాంతి చర్చల విషంలో మా పార్టీ కేంద్ర కమిటీ ఇప్పటికే లేఖలు కూడా జారీ చేసిందని చర్చల విషయంలో మా వైపు నుంచి నిరంతర ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. అయితే ప్రభుత్వ ఉద్దేశం వేరేలా కనిపిస్తోందని చర్చల ద్వారా సమస్య పరిష్కిరించే అవకాశం ఉన్నప్పటికీ అణిచివేత, హింసాకాండ ద్వారాసమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఇందులో భాగంగానే బీజాపూర్-తెలంగాణ సరిహద్దులో భారీ సైనిక ఆపరేషన్ ప్రారంభమైందన్నారు. వెంటనే ఈ ఆపరేషన్ ఆపి బలగాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. చర్చల కోసం అనుకూల వాతావరణం కల్పించాలని, ఆపరేషన్ కగారు (Operation Kagar) నెల రోజుల పాటు వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.






